సామాజిక మాధ్యమం ద్వారా సామాజిక సేవ


Fri,February 22, 2019 12:13 AM

సేవ చేయడం ఒక బాధ్యత. ఆ సేవలో నలుగురిని భాగస్వామ్యం చేయటం అవసరం. అందరినీ కలుపుకొని సామాజిక సేవకు అంకితం కావటం కొందరి వల్లే అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓ డాక్టర్ ముందుకు వచ్చి అందరి మన్ననలనూ పొందుతున్నది.
kerala-doctor
ఒక డాక్టర్ ఏం చేయగలదు. పది మందికి ఉచితంగా వైద్యం అందించగలదు. అంతకన్నా మించి ఏం చేయగలదు అనుకుంటున్నారా? కేరళకు చెందిన శినుశ్యామలన్ అనే వైద్యురాలు తన వైద్య వృత్తిలో భాగంగానే ఓ గిరిజన వాడను ప్రాతిపదికగా తీసుకొని సేవలందిస్తున్నది. తను ఒక్కతే కాదు నలుగురినీ భాగస్వామ్యం చేస్తున్నది. టెక్నాలజీని వాడుకొని సోషల్ మీడియా ద్వారా సహాయకులను చేర్చుకుంటున్నది. ఫేస్‌బుక్ గ్రూప్ క్రియేట్ చేసి వారి కోసం చందాలు పోగేస్తున్నది. కేరళలోని ఓ గిరిజన ప్రాంతంలో ఉండే 47 కుటుంబాల సమస్యలను తెలుసుకుంది. ఇంటింటికీ తిరిగి వారు ఎదుర్కొనే సమస్యలను గుర్తించింది. 12కుటుంబాల వారికి రేషన్ కార్డు గానీ, ఉండేందుకు ఇల్లు కూడా లేదు. వారందరికీ మరింతగా సాయం చేయడానికి తన దగ్గర సరపడినంత డబ్బూ లేదు. అందుకోసం శ్యామలన్ తన ఫేస్‌బుక్ కమ్యూనిటీ ఖాతాను తెరిచింది. అందులో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరిస్తూ రూ.100 నుంచి రూ.10,000వేల వరకు విరాళాలను పోగేసింది. సేకరించిన మొత్తాన్ని ఆ కాలనీ వాసుల సహాయార్థం ఖర్చుపెడుతున్నది. శ్యామలన్ భర్త రాహుల్ ఓ ప్రాథమిక వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ఆయన సహకారంతో శ్యామలన్ కాలనీలో ఉండే వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందిస్తున్నది. తాను సేకరించిన నిధులతో మరుగు దొడ్లు లేనివారికి మరుగుదొడ్లు నిర్మించి ఇస్తున్నది. మరింత మందికి సాయం అందించేందుకు శ్యామలన్ నిజల్ అనే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం శ్యామలన్ ఫేస్‌బుక్ ఖాతాను 48వేల మంది అనుసరిస్తున్నారు.

793
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles