సాగర గర్భంలోకి ప్రయాణం..


Fri,February 8, 2019 01:41 AM

సముద్రతీర ప్రజల జీవనాధారం ఏంటని అడిగితే దాదాపు సీఫుడ్స్ అని చెపుతారు. చాలా మంది దానిపై ఆధారపడి జీవిస్తుంటారు. కానీ తమిళనాడులోని ఓ గ్రామాస్తులు ఏం చేస్తున్నారో తెలుసా..? సముద్రాన్ని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. కానీ సీఫుడ్‌తో కాదు..
tamilanadu
అందరూ మహిళలే. వాళ్ల రోజు గడవాంటే సుముద్రంలోకి దూకాలి. లోతుల్లోకి వెళ్లాలి. సముద్ర గర్భాన్ని తాకాలి. 20 ఏండ్ల నుంచి 70 ఏండ్ల వయస్సు ఉన్న ఎవరైనా సరే ఇదే రోజూ చేసేది. ఇలా వయసుతో సంబంధం లేకుండా సముద్రం మీద ఆధారపడుతూ కుటుంబాలను రక్షించుకుంటున్నారు. ఇంతకు వాళ్లు చేసేది ఏంటంటే... సముద్ర అడుగు భాగంలో దొరికే సీవీడ్ ( సుముద్రపు నాచు మొక్కలు)ను సేకరించి విక్రయిస్తుంటారు. ఈ సీవిడ్ రసాయనాల తయారీకి ఉపయోగపడతాయి. దీనివల్ల వచ్చేదే వారి ఆదాయం. ఇటీవల అక్కడికి వెళ్లిన ఓ వీడియో జర్నలిస్టు వాళ్లతో మాట్లాడి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అక్కడి మహిళలతో మాట్లాడి వారి జీవన విధానాన్ని తెలియజేశాడు. ఆ వీడియో ఇప్పుడు బాగా షేర్ అవుతున్నది. రోజూ సముద్రంలోకి వెళ్లడానికి ఆ మహిళలు కనీసం డైవింగ్ సూట్‌లను కూడా వేసుకోరు. కనీసం ఆక్సీజన్ సిలిండర్ వాళ్లకు తెలియదు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే సాంప్రదాయ డైవర్స్‌గా సముద్రంలోకి వెళ్తారు. నెలలో 12 నుంచి 15 రోజులు ఈ పని చేస్తారు. సుమారు 50 కేజీల సీవీడ్‌ను వాళ్లు రోజూ సేకరిస్తుంటారు. దీన్ని విక్రయించడం ద్వారా వారు నెలకు 8వేల నుంచి 10వేల రూపాయల ఆదాయం పొందుతారు.

845
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles