సాంగ్‌లెస్ సినిమా


Wed,January 8, 2014 03:29 PM

సంగీతానికి చింతకాయలు రాలుతాయా? డౌటే!
కానీ మన సినిమా సంగీతానికి మాత్రం కాసులు రాలుతాయి!
ఆ మాటకొస్తే....వరల్డ్ మూవీలో ఇండియన్ సినిమాకు స్పెషల్ అప్పియన్స్ పాటలే!
భారతీయ చలనచివూతానికి మ్యూజికే యుఎస్‌పి!
కథాపరంగా ఫట్ అయినా మ్యూజికల్‌గా హిట్ అయిన మూవీస్ కోకొల్లలు!
డిజిటల్ సౌండ్ ఎఫెక్ట్స్ హోరులోనూ సాంగ్‌లేకుండా సినిమా వస్తే....
చూద్దాం దాని కథాకమామీషేంటో!

main_image‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః’ అన్నారు! పాటకు పిల్లలు, పశువులే కాదు పాములు కూడా పరవశించి పడగెత్తుతాయట! అందుకే సినిమాకు సంగీత ప్రాణం అయిందేమో! అసలు ఈ పాటల ప్రస్థావన సినిమా కంటే ముందున్న నాటకానిది. ఇంకా చెప్పాలంటే దాని కన్నా ముందున్న యక్షగానాలది. అయితే నాటకంలో ఇది పద్యరూపంలో ఉండేది. సినిమా వచ్చాక అది టాకీల్లోకి మారాక నాటకానికున్న పద్యగానం చలనచివూతానికి సంగీతంగా మారింది. ఇండియన్ సినిమాకు అదో స్పెషల్ ఫీచర్ అయింది. ఐడెంటిగా మారింది. సంప్రదాయంగా స్థిరపడింది. దాంతోనే 1930ల నుంచి ప్రతి సినిమాకు లైట్ మ్యూజిక్ బాణీలు మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలిచాయి. క్రమంగా పాటలు సినిమా నిర్మాణానికే కమర్షియల్ ఎలిమెంట్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అందుకే ఇండియన్ మూవీలో సాంగ్ అండ్ డాన్స్ సీక్వెన్స్ సీన్లకు విపరీతమైన క్రేజ్! హీరోలకు స్పెషల్ ఇమేజ్ ఇచ్చేదీ ఫైట్స్ తర్వాత డాన్సే! డాన్స్ అంటే దానికి అనుసంధానంగా ఉన్న సాంగ్ అనే కదా అర్థం! అదీ మన సినిమాలోని పాట ప్రత్యేకత! ఈ గుర్తింపు... ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఫరెవర్‌గా మిగిలిపోయే ఎన్నో మ్యూజికల్ హిట్ పిక్చర్స్‌నిచ్చింది. ఆల్‌టైమ్ ఫేవట్ సాంగ్స్‌ను రికార్డ్ చేసింది. ప్రేక్షకులను వెర్రెత్తించింది. గ్రామోఫోన్ నుంచి ఇవ్వాళ్టి రింగ్, డైలర్ టోన్ల రూపంలో ఆ పాత, కొత్త మధురాలను సేవ్ చేసింది..చేస్తోంది. ఇదీ భారతీయ సినిమాలోని మ్యూజిక్ ట్రాక్ ! ఈ సౌండ్‌కే ఎఫెక్ట్ తెచ్చిన సాంగ్‌లెస్ సినిమాకూడా సైలెంట్‌గా సెల్యులాయిడ్‌కి ఎక్కింది!

rangulaదేశీ మూవీకి సంబంధించి నిర్మాత, దర్శకుడు బీఆర్ చోప్రా గురించి తెలియని వారుండరు. ఆయన అప్పుడప్పుడు విదేశీ చలనచిత్ర ఉత్సవాలకు వెళ్తుండేవాడు. అయితే వెళ్లిన చాలా చోట్ల ‘ఇండియన్ సినిమాల్లో ఏముంటుంది? నాలుగు పాటలు దానికనుగుణంగా డాన్సులు, కొన్ని ఎమోషనల్ సీన్స్! ఇంతేకదా... పాటలు లేకుండా సినిమా తీయడం భారతీయుల తరం కాదు’ అంటూ కొంతమంది ఫారిన్ ఫిల్మ్‌మేకర్స్, క్రిటిక్స్ కామెంట్ చేస్తూ నవ్వుకున్నారట! ఈ సీన్ బీఆర్ చోప్రాను చాలా బాధపెట్టింది, ఇబ్బందిపెట్టింది. పంతాన్ని పెంచింది. పాటలు లేకుండా సినిమా ఎందుకు చేయలేం? నేనే చేసి చూపిస్తాను అనే నిర్ణయం తీసుకునేలా చేసింది. అలా ఎండ్ అయిన ఆ సీన్ ...

1960లో ‘కానూన్’ అనే సినిమాతో ఓపెన్ అయింది. సింగిల్ సాంగ్ లేకుండా కూడా సినిమాను అద్భుతంగా ఆడించొచ్చని ప్రూవ్ చేసిన మూవీ ఇది. పాటలు లేని మొదటి హిందీ సినిమాగా గొప్ప హిట్‌నూ సాధించిన ‘కానూన్’ ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో ప్రిజర్వ్ అయింది. క్రైమ్, మర్డర్ మిస్టరీ డ్రామాతో బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ సినిమా కాస్టింగ్, డైలాగ్స్, నెరేషన్, డైరెక్షన్, చక్కటి బ్యాక్‌క్షిగౌండ్ స్కోర్ .. ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ మంచి చిత్రంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే అంతకుముందే కేఏ అబ్బాస్ 1954లో పాటలు, డాన్సులు లేకుండా ‘మున్నా’ అనే సినిమా తీశాడని, ఇది కమర్షియల్‌గా ఘోరంగా ఫెయిల్ అయిందని సమాచారం!

న్యూవేవ్ ..సాంగ్‌పూస్
బీఆర్ చోప్రా తీసిన కానూన్ తర్వాత 1965లో నర్గీస్‌దత్ స్వీయ దర్శకత్వంలో సునీల్‌దత్ హీరోగా పాటలు లేకుండా ‘యాదే’ అనే సినిమా తీసింది. అదే సమయంలో న్యూవేవ్ సినిమా కూడా ఇలా పాటలు లేని మూవీ ప్రయత్నానికి బయోస్కోప్‌లోకి రీల్ ఎక్కించింది. ఆ క్రమంలోనే 1965లోనే మృణాల్‌సేన్ ‘భువన్ షోమ్’ సినిమా తీశాడు పాటల జోలికి వెళ్లకుండా! 1969లో పాపులర్ మూవీ డైరెక్టర్ యష్‌చోప్రా ‘ఇత్తెఫాక్’ (హింది)అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేశాడు. టైట్ స్క్రిప్ట్‌తో సాంగ్స్ లేవనే భావననే కలగనీయదు ఈ సినిమా. యష్ ‘ఇత్తెఫాక్’ తర్వాత పాపులర్ ఈ సినిమా సాంగ్స్ లేకుండా క్లాప్ కొట్టుకోవడానికి అంత ధైర్యం చేయలేదనే చెప్పాలి. అయితే 70ల తర్వాత వచ్చిన చాలా ఆర్ట్ సినిమాలు మ్యూజిక్‌ను థీమ్ సీక్వెన్స్‌గా మలచుకుని మెప్పించాయి తప్ప పాటలను మెయిన్ ఎలిమెంట్‌గా తీసుకోలేదు. 19baba0లో వచ్చిన ‘ఏక్ రుకా హువా ఫైసలా’ (బసు చటర్జీ) కూడా పాటలు లేకుండా తెకకెక్కింది. మధ్యతరగతి భావోద్వేగాలే కథాంశగా వచ్చిన ఈ సినిమా ఇబ్బడిముబ్బడిగా కాసుల వర్షం కురిపించకపోయినా నష్టాన్నీ నెత్తినేసుకోలేదు. పైగా ఓ మంచి సినిమాగా మార్కులు కొట్టేసింది. ఎనభయో దశకంలోనే గోవింద్ నిహలానీ దర్శకత్వంలో విడుదలైన ‘పార్టీ’ కూడా సాంగ్ లెస్ మూవీనే. డ్బ్భైల్లో మొదలైన న్యూవేవ్ సాంగ్‌పూస్ మూవీ ప్రస్థానం అడపాదడపా నేటిదాకా కొనసాగుతూనే ఉంది. గోవింద్ నిహలానీ దర్శకత్వంలోనే వచ్చిన అర్థ్, ఆక్రోశ్, ద్రోహ్‌కాల్‌లు కూడా పాటలు లేని సినిమాలే. 1990లో శేఖర్‌కపూర్, డింపుల్ కపాడియా జంటగా నటించిన నిహలానీ సినిమా ‘దృష్టి’..ఎ మూవీ విదవుట్ సాంగ్స్. అయితే సీన్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం ఇందులో సాంగ్ సీక్వెన్స్‌లను ఉపయోగించాడు గోవింద్ నిహలానీ.

వరల్డ్ స్క్రీన్...
1990లో ఎంటరైన ఆర్థిక సరళీకృత విధానాలు మన దేశ సినిమా ఇండస్ట్రీని తడిమాయి. అప్పటి పెరిగిన భారత వలసల కోసం సినిమా ఇండస్ట్రీ ఓవర్సీస్ వైపు ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ప్రవాస భారతీయుల కోసమూ కథలు సినిమాలుగా ముహుర్తాలు పెట్టుకున్న కాలం అది. అప్పుడే మ్యూజిక్ డిజిటల్ సౌండ్ ట్రాక్‌నెక్కింది. ఆరు పాటల స్థానంలో పన్నెండు పాటలు ప్లే అయ్యాయి. ‘మైనే ప్యార్ కియా’ అంటూ, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’ అని వెంటపడి, ‘హమ్ ఆప్ కే హై కౌన్’ అని కవ్విస్తూ, ‘కభీ కుషీ, కభీ గమ్’ నింపుకుని పాటల పంటను పండించాయి. మ్యూజిక్‌తో బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టాయి. ఇండియన్ మూవీ అంటే నథింగ్ బట్ సాంగ్స్ అనే స్టేజ్‌ని మళ్లీ తెచ్చినా దాన్ని ఫారిన్ ప్రేక్షకులూ ఎంజాయ్ చేసే స్థాయికి తీసుకెళ్లాయి. గల్ఫ్ కంట్రీస్ అయితే ఇండియన్ మూవీ మ్యూజిక్, డాన్స్ పట్ల పిచ్చి పెంచుకునేలా చేశాయి ఆ సినిమాలు. అలాంటి టైమ్‌లోనే ఓ మిరకిల్ జరిగింది.

బ్లాక్...
బ్లాక్‌బస్టర్ మూవీగా ముద్ర వేయించుకుంది సంజయ్‌లీలా బన్సాలీ తీసిన ‘బ్లాక్!’ 2005లో వచ్చిన ఈ సినిమా అంతకుముందు బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ (1995), ‘దేవ్‌దాస్ (2002)’ సినిమా రికార్డ్‌లను బ్రేక్ చేసింది. మ్యూజికల్ హిట్స్‌గా ఇంటర్నేషనల్ ఫేమ్ అయిన ఆ రెండు సినిమాలు సాధించిన పది ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ‘బ్లాక్’ సినిమా తుంగలో తొక్కింది. ఆహ్లాదకరమైన బ్యాక్‌క్షిగౌండ్ స్కోర్ తప్ప పాటలే లేని ఈ సినిమా పదకొండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను అందుకుని అటు అవార్డుల పంటను, కమర్షియల్‌గా ఇటు కాసుల పంటనూ పండించి సాంగ్‌పూస్ సినిమా కేటగిరీ కింద ఆల్ టైమ్ క్రెడిట్ సొంతం చేసుకుంది. దీనికి బ్యాక్‌క్షిగౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సంగీతకారుడు మోంటీ శర్మ. అయితే ఆ సినిమా కన్నా ముందే రామ్‌గోపాల్ వర్మ ‘భూత్’ని చేశాడు. తక్కువ బడ్జెట్ (ఆరుకోట్లు) ఒక ఫ్లాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలోనూ పాటలు లేవు. ఇదీ కమర్షియల్ హిట్టే! తక్కువ బడ్జెట్‌తో సాంగ్‌పూస్ ప్రయోగాలు చేస్తూ మంచి లాభాలనూ ఆర్జించవచ్చని నిరూపించిన సినిమా! ఏమాటకామాట చెప్పుకోవాలంటే... లేటెస్ట్ సినిమాలో సాంగ్‌పూస్ ఎక్స్‌పరిమెంట్ చేసి కొత్తగా ఆలోచించే దర్శకులందరికీ మార్గదర్శకంగా నిలిచింది రామ్‌గోపాల్ వర్మే!
‘నేనైతే సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికే పాటలు లేకుండా ప్రయోగం చేశాను. కానీ కొత్తదనం కోసమో, మరింకోదాని కోసమో కాదంటాడు’ నిర్మొహమాటంగా మాట్లాడ్డాన్ని కూడా పబ్లిసిటీగా మలచుకునే రామ్‌గోపాల్ వర్మ. అయినా సినిమా నిర్మాణ విషయంలో కూడా ఒక్కో నిర్మాత, దర్శకుడిది ఒక్కో సంజయ్‌లీలా బన్సాలీ భారీ బడ్జెట్‌తో అంతే భారీ సంగీతంతో దేవ్‌దాస్‌నూ సృష్టించాడు. అంతే భారీ బడ్జెట్‌తో పాటలే లేని బ్లాక్‌నూ తెరకు అద్దాడు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్

కంటిన్యూయింగ్...
రెండువేల దశకంలో ‘భూత్’తో స్టార్ట్ అయిన సాంగ్‌పూస్ మూవీ ట్రెండ్ బ్లాక్‌తో హైప్‌కి వెళ్లి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. భూత్‌తో సాంగ్‌పూస్ మూవీ చూసిన (నిర్మాణ వ్యయం పరంగా)వర్మ మళ్లీ పాటలు లేకుండా సర్కార్, సర్కార్ రాజ్‌ను చూపించాడు. డర్‌నా మనా హై అన్నాడు. ఫూంక్‌ని కూడా పాటలు లేకుండానే విడుదల చేశాడు. కానీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా మిగిలిందా సినిమా. మధుర్ బండార్కర్ కూడా ఇలాంటి ప్రయోగాలకు యాక్షన్ చెప్పాడు. కేవలం సాంగ్ సీక్వెన్స్‌నే ఉపయోగించుకుంటూ పేజ్-3 లాంటి రియలిస్టిక్ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇందులో ఉన్న పాటలన్నీ పాత్రల పరిచయాల్ని, సీన్ ఇంప్టాన్స్‌ను చెప్పేవి. ఇదోరకం ప్రయోగంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ఫ్యాషన్, కార్పొరేట్, చాందినీబార్ సినిమాలు కూడా ఈ శైలిలోనివే! వెరసి సాంగ్ సీక్వెన్స్ చిత్రీకరణ మధుర్ స్టయిల్‌గా మారింది. సాంగ్ సీక్వెన్స్‌ను సీన్ ఇంప్టాన్స్ చెప్పడానికి మలచుకున్న మరో సినిమా అస్తిత్వ. ఉమన్ సబ్జెక్ట్, ఉమన్ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ‘అస్తిత్వ’ బాక్సాఫీస్ హిట్ కాకపోయిన ఆలోచనలు రేకెత్తించిన మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

Bhoot ఎ వెడ్‌నెస్ డే
అదే పనిగా కాకపోయినా అడపాదడపా తక్కువ బడ్జెట్, మంచి కథ, కథనంతో సాంగ్‌పూస్ సినిమా తెరకెక్కుతూనే ఉంది. అలాంటి జాబితాలోనిదే సాగర్ బళ్లారి దర్శకత్వంలో వచ్చిన భేజా ఫ్రై సీక్వెల్ . సున్నితమైన హాస్యంతో నవ్వుల జల్లు కురిపించిన భేజాఫ్రై మనసుకు ఆహ్లాదాన్నిచ్చింది. ముంబైలోని పేలుళ్ల ఆధారంగా నిశికాంత్ కామత్ దర్శకత్వంలో వచ్చిన ‘ముంబై మెరీ జాన్’ పాటలు లేని మంచి సినిమాకు మరో చక్కటి ఉదాహరణ. అయితే కమర్షియల్‌గా ఇది అంత విజయం సాధించకపోయినా గుడ్ మూవీ లిస్ట్‌లో మాత్రం చోటు సంపాదించుకుంది. ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘అబ్ తక్ చప్పన్’, ‘గాంధీ మై ఫాదర్’, ‘నైనా’, ‘వాస్తు శాస్త్ర’ మొదలైన సినిమాలన్నీ కూడా పాటలు లేని సినిమాలే. ఇవన్నీ సరే... నీరజ్ పాండే ఇటీవలే తీసిన (దర్శకుడు) ‘ ఎ వెడ్‌నెస్ డే’ పాటలు లేని సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది. బ్లాక్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్‌నూ గలగలలాడించింది. నసీరుద్దిన్ షా, అనుపమ్ ఖేర్ నటించిన ఈ మూవీ ప్రేరణతో కమల్‌హాసన్, వెంక ప్రధాన పాత్రలుగా తెలుగులో కూడా వచ్చింది ‘ఈనాడు’ పేరుతో. పాటలు లేకుండా! అయితే ఇలాంటి ప్రయోగాలు అలవాటు లేని తెలుగు ప్రేక్షకులు దీన్ని అట్టర్ ఫ్లాప్ చేశారు.


ఇండియన్ సినిమా అంటే పాటల ప్రపంచం! శాస్త్రీయ సంగీతాన్ని అందుకోలేని వాళ్లకు సినిమా సంగీతం శ్రవణానందం! సినిమాకు పాటలు ఏంటీ అని ఒకప్పుడు పెద్ద చర్చ కూడా జరిగింది. సినిమాల్లో పాటలను తీవ్రంగా వ్యతిరేకించిన జ్ఞాన్‌పీఠ్ అవార్డీ యూఆర్ అనంతమూర్తి లాంటి థియేటర్ పర్సనాలిటీలు సైతం తర్వాత ‘నిజమే! ప్రపంచ సినిమా నుంచి ఇండియన్ సినిమాను ప్రత్యేకంగా నిలుపుతున్నదే పాట. అది లేకుండా ఇండియన్ సినిమా ఏంటీ..? ఊహించుకోలేం. అంతకుముందు నేను చేసిన కామెంట్‌ను సవరించుకుంటున్నాను’ అని ప్రకటించాడు. కానీ సినిమా కథాగమనానికి పాటలు పెద్ద అంతరాయం అని భావించే ప్రేక్షకులూ ఉన్నారు. అయితే పాటలు ఒక నాన్‌సెన్స్ అంటూ ఇండియన్ సినిమాను తక్కువ చేసిన ఫారిన్ విమర్శకులకూ సాంగ్‌పూస్ మూవీతో జవాబు చెప్పగల స్టయిల్, సినిమా పాటలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకూ మ్యూజిక్ హిట్స్‌ను ఇవ్వగల ట్రాక్ పవర్ ఇండియన్ సినిమా సొంతం! ఏమైనా మూస ఒక రోత.. ప్రయోగం ఒక వింత!

bombay-meri-jaanకొసమెరుపు
ఇండియన్ సినిమాల్లో పాటలు తప్ప ఏమీ ఉండదని పెదవి విరిచిన ఫారిన్ ఫిల్మ్‌మేకర్స్ మన రూట్‌లోకే వచ్చి స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో పాటలు పెట్టుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ అవార్డూ అందించారు. మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తొలి సాంగ్‌పూస్ సినిమాగా 1954లో ఏవీఎమ్ వాళ్లు తీసిన ‘అందా నాల్’ను చెప్తారు. సీన్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం కనీసం బ్యాక్‌క్షిగౌండ్ స్కోర్‌ను కూడా వాడలేదట ఈ సినిమాలో. శివాజీగణేశన్ నెగటీవ్ రోల్‌లో నటించిన ఈ సినిమానే తర్వాత వచ్చిన సాంగ్‌పూస్ సినిమాలకు ఓ దారి చూపిందని అంటారు సినీ విమర్శకులు. 19baba0 దశకం చివర్లో జోషి అనే మలయాళ దర్శకుడు ‘న్యూ ఢిల్లీ టైమ్స్’ అనే మలయాళ సినిమాను తీశాడు పాటలు లేకుండా. అదే యేడు దీన్నే జోషి ‘అంతిమతీర్పు’ పేరుతో తెలుగులో తెరకెక్కించాడు. నిహలానీ ‘ద్రోహ్‌కాల్’ కూడా తెలుగులో ‘ద్రోహి’గా వచ్చింది.

సరస్వతి రమ

2978
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles