సరైన చికిత్సతో..సంతానం సాఫల్యమే


Mon,September 10, 2018 11:41 PM

ఆధునిక జీవనశైలి అమ్మ తనానికి దూరం చేస్తున్నది. అలవాట్లు.. ఆహారం వంధ్యత్వానికి దగ్గర చేస్తున్నాయి. అవగాహన లేమి సంతానలేమికి దారితీస్తున్నది. ఇలాగైతే ఎలా? మాతృత్వం ఇక అందని ద్రాక్షేనా? ఆధునిక చికిత్సల ద్వారా వంధ్యత్వాన్ని
నిర్మూలించవచ్చు. సరైన సమయంలో.. సరైన రీతిలో చికిత్సలను ఆశ్రయిస్తే సంతాన సాఫ్యలం చేసుకోవచ్చు!

Pregnancy1

వంధ్యత్వం!

ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకున్నా ఏడాది వరకు కూడా గర్భం రాకపోయినట్లయితే దానిని ఇన్ఫెర్టిలిటీ (వంధ్యత్వం)గా భావిస్తారు. ఈ విధంగా వంధ్యత్వం ఏర్పడటానికి వైద్యనిపుణులు పది కారణాలను గుర్తించారు.


లో స్పెర్మ్‌కౌంట్

Sperm
సంతానాన్ని పొందటానికి గాను పురుషుడి ఒక మిల్లీ లీటర్ వీర్యంలో రెండు కోట్ల పురుష బీజ కణాలు ఉండాలి. ఈ సంఖ్య కోటి ఏభై లక్షలు అంతకంటే తక్కువ ఉన్నట్లయితే దానిని స్పెర్మ్‌కౌంట్‌గా భావిస్తారు. ఈ పురుష బీజకణాల సంఖ్య సహజపద్ధతిలో అండాన్ని ఫలదీకరించటానికి సరిపోదు. అందువల్ల దంపతుల్లో సంతానలేమి ఏర్పడుతుంది. మద్యం-పొగాకు వాడకం, అనారోగ్యకర జీవనశైలి ఇందుకు కారణం అవుతున్నట్లు గుర్తించారు.


దేశ జనాభాలో 10-15% మందిలో వంధ్యత్వ సమస్య ఉంది. దాదాపు 40% మంది చికిత్స ద్వారా సంతానం పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం.


ఓవ్యులేషన్ డిజార్డర్: కొంతమంది స్త్రీలలో పలు కారణాల వల్ల అండాలు విడుదల కావు. లేదా సహజ క్రమంలో విడుదల కావు. పిట్యుటరీ గ్రంథి- అండాశయాలు- ఫాలికిల్స్ మధ్య సమాచార మార్పిడి సంబంధం సరిగా పనిచేయకపోవటం, చాలాకాలం హార్మోన్ ఆధారిత గర్భనిరోధక విధానాలను వాడటం వల్ల వంధ్యత్వానికి కారణం అవుతున్నది.


అనారోగ్యకర పురుష బీజకణాలు: పురుషబీజకణాల కదలిక (దాని తోక భాగం చలనం)లో లోపం, పురుషబీజ కణం నిర్మాణంలో (రూపం- తయారవడం- డిఎన్‌ఎ)లోపం వంధ్యత్వానికి కారణం అవుతాయి. వంధ్యత్వం కేసుల్లో దాదాపు 25 శాతం ఈ కారణం వల్లేనని అంచనా.


ఫెలోపియిన్ ట్యూబ్స్ మూసుకుపోవడం:అండాశయం నుంచి విడుదలైన అండాలు గర్భాశయానికి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారానే ప్రయా
ణించడం వల్ల ఈ గొట్టాలు మూసుకుపోయి ఫలదీకరణం చెందిన అండం (జైగోట్) గర్భాశయానికి చేరి గర్భం ఏర్పడే అవకాశాలు ఉండవు. పెల్విక్ (కటిప్రాంతం) ఇన్ఫెక్షన్ డిసీజ్ (పిఐడి), ఎండోమెట్రియోసిస్, గుప్తరోగాల (ఎస్.టి.డి) వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.


ఎండోమెట్రియోసిస్: వంధ్యత్వంతో బాధపడుతున్న స్త్రీలలో 35% ఎండోమెట్రియోసిసే కారణం. గర్భాశయాన్ని గర్భధారణకు సిద్ధంచేసే క్రమంలో ఎండోమెట్రియం పొర మొత్తంగా విడిపోదు. గర్భాశయంలో మిగిలిపోయిన ఎండోమెట్రియం ఫలదీకరణం చెందిన అండం(జైగోట్) స్థిరపడటానికి ఆటంకం కలిగి ఇతర భాగాల్లో అతుక్కున్న ఎండోమెట్రియం ఫెలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డం పడి అండం-పురుషబీజకణం సంయోగం చెందకుండా చేస్తుంది.


అనారోగ్యకర అండం:
sperm1
పోషకాహారలోపం, ఒత్తిడి, హార్మోన్లలోపం, వయసు పైబడటం వంటి కారణాల వల్ల స్త్రీలోని అండాల ఆరోగ్యం దెబ్బతిని గర్భం దాల్చటంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.


వంధ్యత్వ పరీక్షలు:
pregnancy
ఎఫ్.ఎస్.హెచ్, ఈ2, ఎల్.హెచ్. హెచ్.సి.వి ఆంటీబాడీస్-కంప్లీట్ హిమోగ్రామ్ హెచ్.ఐ.వి.-1, 2 ఆంటీబాడీస్-టి.ఎస్.హెచ్. హెచ్.పి.ఎల్.సి. -ఎ.ఎం.హెచ్.-రుబెల్లా 1జిజి -ఎఫ్.టి.3, ఎఫ్.టి.4 -బ్లడ్ షుగర్ మానిటరింగ్ -
ప్రొలాక్టిన్ -హెచ్.బి.ఎస్. ఆంటీజన్. -ఆంటీ హెచ్.బి.సి.


పురుషుడిలోనూ వంధ్యత్వ పరీక్షలు:
అడ్వాన్సుడ్ స్పెర్మ్ ఎనాలిసిస్ -కంప్లీట్ హిమోగ్రామ్ -టెస్టిక్యులార్ బయాప్సీ -హెచ్.బి.ఎస్. ఆంటీజన్ -స్క్రోటల్ అల్ట్రాసౌండ్ -హెచ్.సి.వి. ఆంటీ బాడీస్ -జెనటిక్ టెస్ట్ -హెచ్.ఐ.వి.-1, 2 ఆంటీ బాడీస్ -
కర్యోటైప్ ఎగ్జామినేషన్ -వి.డి.ఆర్.ఎల్.


వంధ్యత్వాన్ని అధిగమించే పద్ధతులు

garbh
గత యాభైయేండ్లలో జరిపిన పరిశోధనలు, అధ్యయనా లు, చికిత్సల ఆధారంగా సంతానలేమి సమస్యను అధిగమించేందుకు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఆర్ట్) అభివృద్ధిచెందిం ది. వంధ్యంత్వం ఎదుర్కొంటున్న మహిళ శరీరంలోంచి అండాలను వెలికి తీసి, ఆమె భర్త నుంచి సేకరించిన పురుషబీజకణాలతో జతచేసి పిండాన్ని అభివృద్ధి చేస్తారు. దానిని తిరిగి ఆ మహిళ గర్భాశయంలో ప్రవేశపెట్టి గర్భాన్ని సాధిస్తారు.


ఐ.వి.ఎఫ్: ఒకటి కంటే ఎక్కువ పిండాలు అభివృద్ధి చెందితే వాటిలోంచి అత్యంత ఆరోగ్యకరమైన పిండాన్ని ఆ మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. తక్కిన పిండాలను శీతలీకరించి భద్రపరుస్తారు. ఆరు వారాల తరువాత ఆల్ట్రాసౌండ్ పరీక్ష జరిపి ఆమెకు గర్భం నిలిచిందీ లేనిది పరీక్షించి నిర్ధారించుకుంటారు. గర్భం నిలవని పక్షంలో శీతలీకరించి ఉంచిన పిండాలలోంచి మరోదానిని గర్భాశయంలోకి ప్రవేశపెట్టి గర్భం నిలిచిందీ నిర్ధారించుకుంటారు.


ఐ.సి.ఎస్.ఐ. : ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇన్జెక్షన్. ఇది పురుషుల్లో తీవ్ర వంధ్యత్వం ఉన్న సందర్భాలలో ఉపయోగించే చికిత్స. ఎంపిక చేసిన పురుషబీజకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందుకోసం ప్రత్యేకమైన సూదిని ఉపయోగించి వీర్యంలోంచి అత్యంత ఆరోగ్యకరమైన పురుషబీజకణాన్ని వేరు తీస్తారు. అతి సూక్ష్మపరికరాలను ఉపయోగించి దానిని అండంలోకి ప్రవేశపెడతారు. అసిస్టెడ్ లేజర్ హాచింగ్: లేజర్‌ను ఉపయోగించి పిండానికి చెందిన కణాల కవచపు మందాన్ని తగ్గిస్తారు. దానివల్ల అది గర్భాశయపు గోడకు అతుక్కొని పెరుగడం సులభం అవుతుంది.


ఐ.వి.ఎఫ్. విత్ డోనార్ ఎగ్స్ :
photo-family
మహిళలలో ఫలదీకరణకు అనుకూలమైన అండాలు ఉత్పత్తిగాని సందర్భాలలో దాత నుంచి స్వీకరించిన అండంతో ఐ.వి.ఎఫ్. నిర్వహించే విధానం ఇది. అజ్ఞాత మహిళ నుంచి స్వీకరించిన అండాన్ని ఫలదీకరించగా ఏర్పడిన పిండాన్ని దంపతులలోని మహిళ గర్భాశయంలో అమర్చటం ద్వారా గర్భాన్ని సాధ్యపరుస్తారు. వీటితోపాటు పురుష బీజ కణాల ఉత్పత్తికి, స్మెర్మ్ ఎనాలసిస్ అనుకూలంగా లేని సందర్భాల్లో ఐ.వి.ఎఫ్. విత్ డోనార్ స్పెర్మ్ పద్ధతి, ఆరోగ్యకరమైన పిండం ఉత్పత్తికాని పరిస్థితులలో ఫలదీకరణ ద్వారా పిండాన్ని ఉత్పత్తి చేసేందుకు ఐ.ఎఫ్ విత్ డోనార్ ఎంబ్రియో పద్ధతి, సంతానం పొందటాన్ని వాయిదా వేయదలచుకున్న దంపతులకు ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ పద్ధతి వంటివి అందుబాటులో ఉంటాయి.
DR-LAKSHMI-KRISHNA-LEELA

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles