సరిగమ వారి సంగీత విందు


Wed,March 6, 2019 01:23 AM

ఆనాటి మధుర గీతాలను వింటుంటే మనసు గాలిలో తేలిపోతుంది. ఒత్తిడి, చికాకు క్షణాల్లో మాయమై, మనసంతా తేలికపడుతుంది. టెక్నాలజీ అలాంటి బహుమతిని సారేగామా రూపంలో మీకందిస్తున్నది.
Legends
ప్రాంతీయ ఆ పాత మధురాలు, శాస్త్రీయ సంగీతాన్ని తెలుగు శ్రోతల కోసం బ్లూటూత్ స్పీకర్‌లో భద్రపరిచి అందిస్తున్నది సారేగామా. కార్వాన్ మినీ లెజెండ్స్ పేరుతో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల వంటి ప్రముఖుల అలనాటి గీతాలను ఎంపిక చేసి ప్రత్యేక బ్లూటూత్ స్పీకర్ రూపొందించింది. ఒక్కసారి బ్లూటూత్ ఆన్ చేస్తే అలనాటి గీతాలు మిమ్మల్ని సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కార్వాన్ మినీ లెజెండ్స్ తెలుగు స్పీకర్ ద్వారా ప్రీలోడ్ చేసిన పాటలతో పాటు బ్లూటూత్, యూఎస్‌బీ, ఆక్స్ లాంటి ఫీచర్లతో మన దగ్గర ఉన్న పాటలను కూడా వినవచ్చు. ఎఫ్‌ఎం కూడా ప్లే చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లే కంఫర్ట్ సైజులో ఈ స్పీకర్ రూపొందించారు. www.saregama.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఈ బ్లూటూత్ స్పీకర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ధర కేవలం రూ.2490 మాత్రమే.

1022
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles