సరికొత్తగా యోగా


Thu,February 7, 2019 01:27 AM

రోజువారీ పనులను మామూలుగా చేసు కుంటూపోతే వింత ఏముంది. అవే పనులను కాస్త భిన్నంగా చేస్తే మాత్రం వింత అనిపిస్తుంది. వింతేకాదు ఆసక్తి కూడా కలుగుతుంది. అందుకోసమే అక్కడ సరికొత్త పద్ధతిలో విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నారు.
basketball-yogakids
ఏదైనా రొటీన్‌కి భిన్నంగా ఉంటేనే అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక తప్పనిసరిగా అదే పని చేయించాల్సి వస్తే మరోవిధంగా ప్రయత్నించాలి. చైనాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు యోగా నేర్పించేందుకు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు శిక్షకులు. ఒక్క యోగానే కాదండోయ్ బాస్కెట్ బాల్‌ను కూడా మేళవించి ఒకేసారి ప్రయత్నిస్తూ.. అటు ఆరోగ్యాన్ని, ఇటు ఆహ్లాదాన్ని అందిస్తున్నారు. బాల, బాలికలకూ యోగా-బాస్కెట్ బాల్‌పై తర్ఫీదు ఇస్తూ అందరినీ ఆకట్టుకునేలా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆడపిల్లలు కొద్దిసేపు యోగా చేస్తారు. అదే సమయంలో మగపిల్లలు బాస్కెట్ బాల్ ఆడుతుంటారు. అలా కొద్దిసేపు వీళ్లు, కొద్దిసేపు వాళ్లు మార్చుకుంటూ యోగా-బాస్కెట్ బాల్‌ను ప్రయత్నిస్తుంటారు. మామూలుగా యోగా నేర్చుకోమంటే పిల్లలు ఆసక్తి చూపకపోవడంతో ఇలా చేస్తున్నారు. రెండింటినీ ఒకేసారి నేర్పిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు శిక్షకులు. ఇలా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి పిల్లలు మరింత చలాకీగా ఉంటారని అంటున్నారు. అందుకే అంటారు కొత్త ఒక వింత పాత ఒక రోత అని.

207
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles