సరికొత్తగా.. ఉన్నతంగా


Fri,April 19, 2019 01:39 AM

ఉన్నత సదుపాయాలంటే.. ఉన్నంతలో ఉండేవి కావు. మన ఊహలకు అందనివి. మొదటిసారి భారతీయ రైల్వే చరిత్రలో ప్రతిష్ఠాత్మకంగా కట్టిన ఈ లాంజ్ గురించి చదవండి.
Madurai-Station
మన దేశంలో రైల్వే స్టేషన్‌లంటే.. ప్లాట్‌ఫామ్ మీద రద్దీ, హారన్‌ల శబ్దాలు, హడావిడి కనిపిస్తుంది. రైలు మిస్సయిన ప్రయాణికులు, రైలులో వచ్చే ప్రయాణికుల కోసం ఎదురుచూసే విజిటర్స్ కోసం భారతీయ రైల్వే శాఖ ప్రారంభించిన సరికొత్త వెయిటింగ్ లాంజ్ ఇది. మధురై రైల్వే స్టేషన్‌లో ఈ ప్రీమియం వెయిటింగ్ లాంజ్‌ను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొదటి లగ్జరీ లాంజ్. రైలు మిస్సయిన వాళ్లు ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో ఉండే లాంజ్ తరహాలో భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా ఇక్కడ మొదలుపెట్టింది. 150 రూపాయలు చెల్లిస్తే వైఫై, ఎంటర్‌టైన్‌మెంట్, ఫుడ్, డ్రింక్స్, స్నానం చేయడానికి వాష్‌రూమ్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ప్రింటర్, రిైక్లెనర్స్ కూడా ఉన్నాయి.వాటికి చార్జీలు వేరే ఉంటాయి. రెండు గంటల తర్వాత గంటకు యాభై రూపాయల చొప్పున చెల్లించాలి. ఆర్‌ఎమ్‌డీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ వీటి నిర్వహణని చూసుకోనున్నది. ముఖ్యంగా లాండ్రీ సర్వీస్, వైద్య సదుపాయం కూడా ఉన్నది.

193
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles