సయాటికా విడుపు-6


Fri,July 19, 2013 11:48 PM

yoga
సయాటికాను అదుపులో ఉంచడానికి వెన్నెముక పనితీరు, ఫ్లెక్సిబిలిటీ చాలా కీలకం. అలా వెన్నెముక పనితీరును మెరుగుపరిచి, దృఢంగా ఉంచే వక్రాసనం ఈ వారం...
వక్రాసనం
ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లు ముందుకు చాచాలి. ఎడమకాలిని మోకాలి దగ్గర మడిచి కుడికాలు మోకాలు పక్కగా ఉంచాలి. ఇప్పుడు కుడిచేతితో ఎడమకాలి మడమను పట్టుకోవాలి. ఎడమచేతిని శరీరం వెనుకగా వెన్నెముక కిందుగా ఉంచాలి. తరువాత గాలి దీర్ఘంగా పీల్చి వదులుతూ తలను, భుజాలను ఎడమపక్కకు తిప్పాలి. భుజాల మీదుగా వెనుకకు చూడాలి. కొన్ని సెకన్లు ఈ స్థితిలో ఉండి తిరిగి గాలి పీలుస్తూ ముందుకు రావాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఇదేవిధంగా కుడికాలితో కూడా చేయాలి.
వక్రాసనం వేరియేషన్
ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లు ముందుకు చాచాలి. ఎడమకాలిని మోకాలి దగ్గర మడిచి కుడికాలు మీదుగా అవతలివైపు తీసుకెళ్లి (ఫొటోలో చూపినట్లుగా) మోకాలు పక్కగా ఉంచాలి. ఇప్పుడు కుడిచేతితో ఎడమకాలి మడమను పట్టుకోవాలి. ఎడమచేతిని శరీరం వెనుకగా వెన్నెముక కిందుగా ఉంచాలి. తరువాత గాలి దీర్ఘంగా పీల్చి వదులుతూ తలను, భుజాలను ఎడమపక్కకు తిప్పాలి. భుజాల మీదుగా వెనుకకు చూడాలి. కొన్ని సెకన్లు ఈ స్థితిలో ఉండి తిరిగి గాలి పీలుస్తూ ముందుకురావాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఇదే విధంగా కుడికాలితో కూడా చేయాలి.
ఉపయోగాలు :
- వక్రాసనం వెన్నెముకలో ఫ్లెక్సిబిలిటీని పెంచి, వెన్నెముకను దృఢపరుస్తుంది.
- ఏకాక్షిగతను, విల్‌పవర్‌ను పెంచుతుంది.
- వెనుకకు తిరిగి ఆగినప్పుడు ఏర్పడే కంప్రెషన్ వల్ల పొట్టలో అన్ని భాగాలకు మంచి మసాజ్ లభిస్తుంది.
- రక్తవూపసరణ మెరుగుపడుతుంది.
- స్టిఫ్‌నెస్, స్ట్రెస్‌వల్ల కలిగే వీపునొప్పిని తగ్గిస్తుంది.
- ఎక్కువ సమయం కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి ఇది చాలా మంచిది.
జాగ్రత్తలు :
- తీవ్రమైన వెన్నునొప్పి సమస్య ఉన్నవారు, అల్సర్, హెర్నియా ఉన్నవారు చేయకూడదు.
గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

3778
Tags

More News

VIRAL NEWS