సయాటికా విడుపు-4


Sat,July 6, 2013 12:31 AM

yoga
వెన్నెముక చుట్టూ రక్త ప్రసరణ పెంచి, దాని పనితీరును మెరుగుపరిచి... సయాటికా నుంచి విముక్తి కలిగించే ఆసనాల్లో జాను శీర్షాసనం ఒకటి! అయితే పూర్తి జాను శీర్షాసనం వేయడం కొంతమందికి మొదట కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు ముందు జాను శీర్షాసనం ప్రిపరేషన్ చేసి తరువాత ఆసనాన్ని ప్రయత్నించాలి.

జాను శీర్షాసనం ప్రిపరేషన్
దీన్నే అర్ధ పద్మాసనం అని కూడా పిలుస్తారు. ముందుగా కుడికాలును మోకాలు దగ్గర మడవాలి. కుడిపాదాన్ని ఎడమ కాలిమీద పెట్టి మోకాలి మీద (ఫొటోలో ఉన్న విధంగా) చేయి పెట్టి, పైకి.. కిందకు పదిహేను సార్లు కదల్చాలి. ఇలా రెండు కాళ్లతో ప్రయత్నించాలి. దీంతో నెమ్మదిగా జాను శీర్షాసనం వేయగలుగుతారు.

ఉపయోగాలు :
నిటారుగా ఉంచుతుంది.
- మనసును ప్రశాంతం చేస్తుంది.
- మెడి ప్రాణాయామాలకు మంచి ఆసనం.

జాగ్రత్తలు :
మోకాలి నొప్పులు ఎక్కువగా ఉన్నవారు నిపుణుల ఆధ్వర్యంలో చేయాలి.

జాను శీర్షాసనం
జాను అనగా మోకాలు. ఈ ఆసనంలో తలను మోకాలు దగ్గరకు తీసుకొస్తాం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. రెండుకాళ్లనూ ముందుకు చాచి వెన్నెముకను నిటారుగా ఉంచి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు కుడికాలిని మడిచి కుడిపాదం ఎడమకాలి తొడదగ్గర ఆన్చాలి. రెండు చేతులనూ పైకి చాచి గాలి పీల్చుకుని, శరీరాన్ని ఎడమవైపుగా తిప్పాలి. గాలి వదులుతూ రెండు చేతులనూ ముందుకు వంచి ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. రెండు చేతులనూ పాదం చుట్టూ పెనవేయాలి. పొట్టలోపలికి లాగిపట్టి ఉంచాలి. ఇలా 5 నుంచి 8 సెకెన్లపాటు ఉన్న తరువాత గాలి పీల్చుకుంటూ తల, శరీరం, చేతులు పైకి తీసుకురావాలి. ఇలా ఐదు సార్లు ఎడమకాలితో, ఐదు సార్లు కుడికాలితో చేయాలి.

ఉపయోగాలు :
- వెన్నెముక చుట్టుపక్కల రక్త ప్రసరణను పెంచుతుంది.
- వెన్నునొప్పిని తగ్గిస్తుంది.
- లివర్, స్ల్పీన్ (చేదు)ల పనితీరును మెరుగుపరుస్తుంది.
- ఉదరాంగాలకు మంచి మసాజ్‌నిస్తుంది.
- ఊపిరితిత్తులను శక్తివంతం చేస్తుంది.
-నాడీవ్యవస్థను బాగా ఉత్తేజితం చేస్తుంది.

గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

3711
Tags

More News

VIRAL NEWS