సయాటికా విడుపు-2


Sat,June 22, 2013 01:46 AM

yoga
శరీరంలోని అన్ని భాగాలను ఉత్తేజితం చేసి గ్రంథుల పనితీరును మెరుగుపరిచే ఆసనం కపోతాసనం. ఇది వెన్నుముకకు సంబంధించిన రుగ్మతలను నయం చేయడమే కాదు పొట్ట భాగానికి మంచి రూపాన్ని ఇస్తుంది. అన్నింటినీ మించి సయాటికా విడుపులో ప్రధాన పాత్రపోషించే కపోతాసనం ఈవారం...
కపోతాసనం ప్రిపరేషన్
వజ్రాసనంలో కూర్చొని కుడికాలును కొద్దిగా ముందుకు తీసుకురావాలి. రెండు చేతులను కుడికాలు ముందు భాగంలో భూమిపై ఆనేలా ఉంచాలి. ఇప్పుడు ఎడమకాలును వెనక్కి చాపాలి. గాలి పీల్చుకుంటూ తలను పైకి ఎత్తాలి. ఇలా ఎత్తినప్పుడు ధ్యాస వెన్నెముకపై ఉంచాలి. గాలి వదిలేస్తూ చేతులతో బ్యాలెన్స్ చేస్తూ తలను భూమి మీద ఆన్చాలి. తిరిగి గాలి పీలుస్తూ తల పైకి తీసుకురావాలి. ఇలా పదిసార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమ కాలును ముందుకు, కుడికాలును వెనక్కి చాచి కూడా చేయాలి.
కపోతాసనం
వజ్రాసనంలో కూర్చొని కుడికాలును ముందుకు తీసుకొచ్చి రెండు చేతుల మధ్య నుంచి ముందుకు పెట్టాలి. ఎడమకాలును వెనక్కి చాచాలి. ఇప్పుడు ఎడమ కాలును మడిచి ఎడమచేతిని ఎడమకాలు మీదుగా తీసుకురావాలి. తరువాత కుడిచేతిని వెనుకగా తీసుకెళ్లి ఎడమచేతిని పట్టుకోవాలి. ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థితికి రావాలి. ఇదేవిధంగా ఎడమవైపు కూడా చేయాలి.
ఉపయోగాలు :
-నడుము భాగానికి మంచి వ్యాయామం.
-కాలి కండరాలను శక్తివంతం చేస్తుంది.
-శ్వాసక్షికియను మెరుగుపరుస్తుంది.
-మూత్రపిండాలు చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
గమనిక
-యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

4099
Tags

More News

VIRAL NEWS