సయాటికా విడుపు-1


Sat,June 15, 2013 12:31 AM

yoga
శరీరంలో వెన్నెముక కేంద్ర నాడీవ్యవస్థను కాపాడే ఒక రక్షణ వ్యవస్థ. ఈ వెన్నెముకలోని డిస్క్‌లు అన్ని వైపులా వంగేందుకు వీలుగా ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఈ డిస్క్‌లు ఉబ్బుతాయి. దీంతో నరాల మీద ఒత్తిడి పెరిగిన తీవ్రమైన నొప్పి రావచ్చు. ఇది ఒక్కోసారి తుంటి భాగం నుంచి కాలికిందికి కూడా పాకుతుంది. అదే సయాటికా. ఈ నొప్పిని నివారించే లేదా ఉపశమనం కలిగించే కొన్ని ఆసనాలు మీకోసం..

ఏకపాద పవన ముక్తాసనం
ముందుగా వెల్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుని కుడికాలిని 90 డిగ్రీల కోణంలో లేపాలి. గాలి వదులుతూ కాలిని రెండు చేతులతో పట్టుకోవాలి. అదే సమయంలో తలను, భుజాలను నేలమీద నుంచి పైకి లేపి తలను మోకాలికి ఆన్చాలి. అలా ఐదు సెకన్లపాటు ఆపి... నెమ్మదిగా గాలిపీలుస్తూ తలను వెనక్కు తీసుకురావాలి. గాలి వదులుతూ కాలు యథాస్థితికి తేవాలి. ఇదేవిధంగా ఎడమకాలితో చేయాలి. రెండుకాళ్లతో మూడు సార్లు రిపీట్ చేయాలి.

ద్విపాద పవనముక్తాసనం
ముందుగా వెల్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుని రెండుకాళ్లను 90 డిగ్రీల కోణంలో లేపాలి. గాలి వదులుతూ కాళ్లను రెండు చేతులతో పట్టుకోవాలి. అదే సమయంలో తలను, భుజాలను నేలమీద నుంచి పైకి లేపి తలకు రెండు మోకాళ్లను ఆన్చాలి. అలా ఐదు సెకన్లపాటు ఆపి... నెమ్మదిగా గాలిపీలుస్తూ తలను వెనక్కి తీసుకురావాలి. గాలి వదులుతూ కాలు యథాస్థితికి తేవాలి. ఈ విధంగా మూడు సార్లు రిపీట్ చేయాలి.

రోలింగ్
ద్విపాద పవనముక్తాసనం మాదిరిగానే రెండు కాళ్లు 90 డిగ్రీల కోణంలో లేపాలి. ఇప్పుడు కాళ్లు పట్టుకుని ముందుకూ, వెనకకూ 10 సార్లు రోల్ చేయాలి. ఇది వెన్నెముకకు మంచి మసాజ్‌ను ఇస్తుంది.

ఉపయోగాలు :
- పొట్టచుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.
- పాంక్రియాస్(క్లోమక్షిగంథి)ని ఉత్తేజితం చేస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.
- కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
- నడుము భాగాన్ని ఉత్తేజితం చేస్తుంది.
- పునరుత్పత్తి అవయవాల పనితీరును క్రమపరుస్తుంది.

జాగ్రత్తలు :
- మెడనొప్పి, బీపీ ఉన్నవారు తలను పైకెత్తకుండా ఈ ఆసనాన్ని చేయాలి.
- స్లిప్‌డిస్క్, సయాటికా ఉన్నవారు నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి.

గమనిక
- యోగాకి ముందు పక్కనున్న వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

4331
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles