సయాటికాకు సూటి చికిత్స


Tue,July 25, 2017 12:04 AM

సయాటికా మన శరీరంలోని అతి పొడువైన నాడి. ఇది వెన్ను పూస నుంచి ప్రారంభమై పిరుదుల నుంచి పిక్కలు, పాదాలకు స్పర్శను గ్రహించడానికి తోడ్పడుతుంది. సయాటికా నాడి ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటికా అని అంటారు. నిజానికి ఇది ఒక లక్షణం. వెన్నుపూసల మధ్య నుంచి డిస్క్ జారడం వల్ల కలిగే నొప్పి ఇది. సయాటికా నొప్పి తగిన చికిత్సతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే 4 నుంచి 8 వారాల్లో తగ్గిపోతుంది.
sciatica-pain

లక్షణాలు


నడుములో ప్రారంభమైన నొప్పి పిరుదుల నుంచి తొడల్లోకి అక్కడి నుంచి పిక్కల్లోకి ప్రసరించడం సయాటికాలోని ప్రధాన లక్షణం. సయాటికా నాడి ప్రయాణించే మార్గం మొత్తం నొప్పిగా అనిపించవచ్చు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఎక్కువ సమయం పాటు కూర్చున్నప్పుడు సమస్య తీవ్రం కావచ్చు. నొప్పి ఒకే కాలులో కూడా ఉండవచ్చు. ఒక్కోసారి ఒక కాలులో నొప్పి ఉండి మరో కాలులో తిమ్మిర్లు రావచ్చు. నొప్పి సూదులు గుచ్చుతున్నట్టు పాదంలో ఎక్కువగా ఉంటుంది. సమస్య తీవ్రమైనప్పుడు మల మూత్రాల మీద నియంత్రణ కోల్పోవచ్చు. కానీ ఇది చాలా అరుదు. దీన్ని కాడా ఈక్వినా సిండ్రోమ్ అంటారు.

కారణాలు


-డిస్క్ జారిపోవడం - వెన్నుపూసల మధ్య మృదులాస్థి నిర్మిత డిస్క్ ఉంటుంది. ఇది వెన్నెముక కదలికలు సులభంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కదలికల సమయంలో ఏర్పడే ఒత్తిళ్లను గ్రహిస్తూ షాక్ అబ్జర్బార్‌లుగా పనిచేస్తాయి. వయసుతోపాటు ఇవి దెబ్బతింటాయి లేదా శిష్కిస్తాయి. లేదా మందం తగ్గిపోతాయి. ఫలితంగా డిస్క్ కొద్దిగా పక్కకు జరుగడం లేదా స్లిప్ కావడం లేదా పెలుసుగా మారడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఈ స్థితిని హర్నిమేటెడ్ డిస్క్ అంటారు. ఈ స్థితిలో వెన్ను పూసల మధ్య దూరం తగ్గుతుంది. ఇక్కడ సయాటికా నాడి మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది సయాటికా సమస్యకు కారణం అవుతుంది.
-లాంబార్ స్టినోసిస్ - వెన్నెముక ప్రయాణించే కెనాల్ ఇరుకుగా మారితే కెనాల్ స్టినోసిస్ అంటారు. ఈ స్థితిలో నాడుల మీద ఒత్తిడి పడుతుంది. ఈ నాడుల ఆధీనంలో ఉండే కండరాల మీద ఒత్తిడితో కూడిన నొప్పి వస్తుంది.
-స్పాండిలో లిస్థిసిస్, సైరీ పార్మిన్ సిండ్రోమ్, స్పైనల్ ట్యూమర్స్ వంటి రకరకాల కారణాలతో సయాటికా సమస్య రావచ్చు.

జాగ్రత్తలు


విశ్రాంతి తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, నొప్పి తగ్గేందుకు చిన్నపాటి వ్యాయామాలు చెయ్యడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
reddy

హోమియోచికిత్స


సయాటికాకు హోమియోపతిలో చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. వ్యాధి లక్షణాలతో పాటు వారి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో వైద్యం అందిస్తారు. దీనితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎలాంటి ఆహార విహార నియమాలు ఉండవు. వ్యాధి నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని అపోహ పడుతుంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. దీర్ఘకాలిక సమస్యలకు మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వ్యాధులకు కాదు. అదీకాక ఇది చాలా సురక్షితమైన వైద్య విధానం. నిపుణుల సలహా మేరకు సరైన చికిత్స తీసుకోవడం ద్వారా హోమియోపతి వైద్యం ద్వారా మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

976
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles