సముద్రాన్ని శుభ్ర పరుస్తుంది!


Sun,February 3, 2019 12:35 AM

సముద్రాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. దీంతో సముద్రపు చేపలు తినడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా
12 యేండ్ల బాలుడు ఓ నౌకను రూపొందించాడు. అది మామూలు నౌక కాదు.. సముద్రాన్ని శుద్ధి చేసేది.

hazeek-khazi
మహారాష్ట్రలోని పుణెకు చెందిన 12 యేండ్ల హజీక్ ఖాజీ కొత్త ఆవిష్కరణతో ఔరా అనిపించాడు. సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించడమే పనిగా పెట్టుకున్నాడు. సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓ నౌకను రూపొందించాడు. ఇది సముద్రాన్ని శుద్ధి చేస్తుంది. ఖాజీ డాక్యుమెంటరీలు ఎక్కువగా చూస్తుండేవాడు. వాటి ప్రభావమే నౌకను తయారు చేసేలా చేసింది. ఖాజీ తయారు చేసిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్థాలను వేరు చేసి శుద్ధ జలంగా మార్చుతుంది. ఈ నౌక సముద్రపు వ్యర్థ పదార్థాలను ఐదు భాగాలుగా విడగొడుతుంది. టెడ్‌ఎక్స్, టెడ్ 8 వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఈ నౌక డిజైన్‌ను ఖాజీ ప్రపంచం ముందు ఉంచాడు. దానిని పరిశీలించిన పలువురు మేథావులు, సంస్థలు అతడి ప్రతిభకు అబ్బురపడ్డాయి. దాని పేరు ఎర్విస్ నౌక. దీని కింది భాగంలో ఉండే మెషీన్ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి విడగొడుతుంది. ఇలా ఈ నౌక సముద్రం అంతా గాలించి వ్యర్థాలను వేరు చేస్తుంది. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జరిగే అనర్థాలు, ముప్పుపై ఖాజీ ప్రస్తుతం పలు రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు.

554
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles