సముద్రంలో సూపర్ మార్కెట్!


Thu,February 28, 2019 01:53 AM

అక్కడ షాపింగ్ చేయాలంటే సముద్ర ప్రయాణం చేయాల్సిందే. ఎందుకంటే సూపర్ మార్కెట్‌ను అక్కడే ఏర్పాటు చేశారు.
super-market-in-see
దుబాయ్‌లో కట్టడాలు, ఎత్తైన నిర్మాణాలు ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అటువంటి ఆకర్షణల జాబితాలో మరొకటి చేరింది. సముద్రంలో బోటు షికారు చేసే వారి కోసం అక్కడ ప్రత్యేకంగా ఓ బోటులోనే సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఆ సూపర్ మార్కెట్‌లో దొరకని వస్తువంటూ ఉండదు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సముద్రమార్గం మధ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కార్ రీఫోర్ అనే సంస్థ సముద్రంలో ప్రయాణించే వారి కోసం సూపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. ఇతర బోట్లలో ప్రయాణించే ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కావల్సిన సరుకులను స్మార్ట్ ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే సూపర్ మార్కెట్‌కు వెళ్లి తీసుకోవచ్చు. బోటులోనే ప్రత్యేకంగా సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సముద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ బోటు ప్రత్యేకత ఏమిటంటే సముద్రంలో ఉన్న వ్యర్థాలను కూడా వెలికి తీసి పర్యావరణానికి హాని కలగకుండా రక్షించే ప్రయత్నం చేస్తుంది.

560
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles