సమస్యలను లాటెంట్ వ్యూతో పరిష్కరిస్తామంటున్న ప్రమద్ జంధ్యాల


Mon,February 4, 2019 01:31 AM

వినియోగదారులకు, కంపెనీ క్లయింట్లకు వ్యాపారపరమైన సమస్యలను విశ్లేషించి వాటికి తగిన పరిష్కారాలను చూపుతుంది లాటెంట్ వ్యూ సంస్థ. లాటెంట్ వ్యూ అంటే.. నిగూఢమైన దృశ్యం లేదా రహస్యమైన దృశ్యం అని అర్థం. ఇలా సమాచార విశ్లేషణ అందించడం ద్వారా క్లయింట్లు తమ వ్యాపారాల్లో నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతారు. వ్యాపారంలో సమస్యలేవైనా డిఫరెంట్ యాంగిల్‌లో విశ్లేషించి పరిష్కారం చూపుతుంది. కంపెనీకి అండగా కంపెనీ (తోడు) ఇస్తామంటున్న లాటెంట్ వ్యూ సహ వ్యవస్థాపకురాలు ప్రమద్ జంధ్యాల సక్సెస్‌మంత్ర.
latentview
ఆత్మవిశ్వాసంతో కూడిన ఆహార్యాన్ని ప్రదర్శించడం, మనసుకు తోచిన విధంగా చేయాలని నిశ్చయించుకోవడం, సమాధానాలు, పరిష్కార మార్గాలను ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వగలగడం లాటెంట్ వ్యూ ప్రత్యేకత. అంతేకానీ చిన్న గమ్యాలతో సరిపెట్టి .. భారీ లక్ష్యాలను చిదిమేయొద్దు అంటున్నారు ప్రమద్.

తొలి అడుగులు

ప్రమద్ జంధ్యాల బిట్స్ పిలానీ (BITS Pilani )లో తన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కోల్‌కతా ఐఐఎమ్ (IIM) లో ఆర్థిక విశ్లేషణ, సేవల విభాగంలో పనిచేశారు. ఇదంతా లాటెంట్ వ్యూ (LATENTVIEW) సంస్థకు సహ వ్యవస్థాపకురాలు అవక ముందు నాటి మాట. సమాచార విశ్లేషణ, సమాచార నిర్వహణ రంగాల్లో అప్పటివరకు ఉన్న వాటినే అనుసరించిన ఆమె ఆ తరువాతే ఆ రంగంలో మార్పులు తీసుకురావాలని బలంగా నిర్ణయించుకున్నారు. అలా అనుకుని వదిలేయలేదు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక్కడే ప్రమద్ ప్రయాణం లాటెంట్ వ్యూ స్థాపన దిశగా అడుగులు వేయడానికి మార్గాన్ని సుగమం చేసింది. ఆర్థిక, మానవవనరుల, పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే శాఖలో డైరెక్టర్‌గా తన కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు.

కాలేజీ రోజుల్లోనే ..

నిజానికి ఈ కార్యక్రమానికి తన కాలేజీ రోజుల్లోనే బీజాలు పడ్డాయంటున్నది ప్రమద్ జంధ్యాల. మొదటి నుండి కూడా క్రమశిక్షణ, కృషి, నమ్మినదానిపై ఖచ్చితంగా నిలబడడం అనే మూడు విశిష్టమైన లక్షణాలు ప్రమద్ జంధ్యాలపై ప్రభావాన్ని చూపాయి. అదెలా అంటే నేను బ్రాడ్ బేస్‌డ్ (broad-based) అనే పదంపై పాఠ్యాంశాన్ని తయారు చేసి.. కాలేజీ ఓరియెంటేషన్ సెషన్‌లో (orientation session) లో ప్రదర్శించాను. దాని ఉద్దేశం ఒకరిని ఒకరు సహకరించుకుంటూ నేర్చుకోవడం. దాన్ని నేనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా స్వాగతించడాన్ని అభివృద్ధి చేసుకున్నాను. బిట్స్‌లో బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయడం, సహకారాన్ని అందించడమనే వ్యాపారాన్ని తెలుసుకున్నా. విద్యా ప్రపంచానికి వెలుపల కూడా చాలా విజ్ఞానం ఉంటుంది. ఎలాంటి కలతలు లేని పిలానీలో చదువులు అద్భుతమైన అందాల ప్రపంచాన్ని నాకు పరిచయం చేశాయి. అది నా భవిష్యత్‌కు విశాలమైన పునాదులనే వేసింది అని తన అనుభవాలను వివరించారామె.

ఏం చేస్తుంది?

లాటెంట్ వ్యూ ఇచ్చే వ్యాపార పరిష్కారాలతో ఆయా కంపెనీలు తమ వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాయి. వారి వారి వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలను అందించడంలో పురోగతి సాధిస్తాయి. వినియోగదారులకు ఆర్థికపరమైన సేవలను, బీమా, వినియోగ వస్తువులు, రిటైల్, సాంకేతిక రంగాల్లో నిపుణుల ద్వారా వ్యాపార అండదండలను కల్పిస్తున్న లాటెంట్ వ్యూ. పలు కంపెనీలకు వ్యాపార విశ్లేషణలు అందిస్తున్నది లాటెంట్ వ్యూ. సమాచార సహాయంతో పాటు మంచి బిజినెస్, మార్కెటింగ్ నిర్ణయాలను అత్యుత్తమ సాంకేతిక విలువలతో వినియోగదారులకు అందిస్తున్నది. విలువలపై ఆధారపడి కంపెనీ పనిచేయడమే కాకుండా ఏ యేటికాయేడు విజయవంతంగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నది.

ఇతర సంస్థలతో తేడా

మేం కల్పించే వ్యాపార సంబంధమైన పరిష్కారాలు, గణిత సమస్యల్లో కూడా చూసుండరు. మా క్లయింట్స్ తో సత్సంబంధాలు కలిగి ఉంటాం. ఈ రెండు అంశాల కారణంగా ఇతర కంపెనీలతో మా కంపెనీని పోల్చి చూడలేం ప్రమద్ జంధ్యాల. తమ సేవలను విస్తరించుకుంటూ కంపెనీ ముద్రను మార్కెట్ లో చెరిగిపోనీయకుండా సమీప భవిష్యత్‌లో క్లయింట్లను కూడా కలుపుకొని వెళ్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారామె.

ఇయర్ అనలిటిక్స్ అవార్డు

అందుబాటులో ఉండే అపరిమితమైన ప్రపంచ స్థాయి వ్యాపార విశ్లషకులు, సమాచార నిర్వాహక నిపుణుల సహకారంతో క్షేత్ర స్థాయి నుంచి సమస్యలను పరిష్కరించడంలో లాటెంట్ వ్యూ అనుభవం గల సంస్థగా పేరును సంపాదించుకుంది. అంతేకాదు 2015 ఏడాదికి గాను కంపెనీ ఆఫ్ ద ఇయర్ అనలిటిక్స్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. దీన్ని బట్టే లాటెంట్ వ్యూ.. వ్యాపార ప్రపంచంలో ఎలాంటి సేవలను అందిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.

లాటెంట్ వ్యూ స్థాపన..

latentview2
ప్రమద్ వ్యాపార, వాణిజ్య భద్రతా విభాగంలో (సెక్యూరిటీస్ మార్కెట్లో) పనిచేశారు. ఆర్థిక సేవలు, పరపతి నిర్ధారణ ఇవన్నీ కూడా డేటా అనలిటిక్స్‌లో ఉంటాయి. ప్రజాసంబంధమైన వ్యవహారాలపై కూడా ప్రమద్ ప్రత్యేకమైన దృష్టి పెట్టేది. కస్టమర్లు సులభంగా పనిచేయడానికి స్ఫూర్తిని కలిగించే విషయాలను పరిశీలించి అర్థం చేసుకునేవారు. ఈ అనుభవాలన్నీ కూడా 2006 ఏడాదిలో లాటెంట్ వ్యూ (Latent view) పురుడు పోసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి 320 మంది బలమైన , సామర్థ్యవంతమైన బృందం ఐదు ప్రాంతాల్లో పనిచేస్తున్నది. వినియోగదారులకు, కంపెనీ క్లయింట్లకు వ్యాపారపరమైన సమస్యలను విశ్లేషించి వాటికి తగిన పరిష్కారాలను చూపాలనే లక్ష్యమే లాటెంట్ వ్యూ సంస్థ స్థాపనకు దారితీసిందని అంటారామె.. ఇలా సమాచార విశ్లేషణ అందించడం ద్వారా క్లయింట్లు తమ వ్యాపారాల్లో నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతారు.
latentview1
ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సామాజిక మాధ్యమం లేదా సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగకరంగా ఉంటున్నది. వ్యాపారంలో వినియోగదారులు చెప్పే విషయాలను తెలుసుకుని.. మార్కెట్ కు ఏది అవసరమో, అనుగుణంగా ఉంటున్నదో దాన్ని పసిగట్టగలుగతాం. సంప్రదాయ సర్వర్లన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్‌కు సరిపోవు. కంపెనీలన్నీ సౌకర్యవంతంగా వ్యాపార విశ్లేషణలు పొందగలగాలంటే క్లౌడ్ అవసరమవుతుంది. ఈ విషయంలో లాటెంట్ వ్యూ అందరికీ సులభతరమైన సేవలనే అందిస్తున్నది. మొబైల్ ప్రభావం ఇప్పటి మార్కెట్‌పై చాలా ఉంది. ఇదో ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మనం ఎక్కడుంటే అక్కడ అంటిపెట్టుకుని ఉండే సాధనం మొబైల్. పైగా వ్యక్తిగత సమాచారాన్ని జతచేసేందుకు ఈ పద్ధతి చాలా తెలివైంది కూడా. సమాచార విశ్లేషణకు సంబంధించిన సందేశాలను పొందేందుకు సహాయపడుతుంది. మన దగ్గరున్న పూర్తి సమాచారం లోతుల్లోకి తలమునకలై వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.
-ప్రమద్ జంధ్యాల

800
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles