సమర్పించండి.. సరైన పత్రాలు


Sat,February 9, 2019 01:49 AM

-589 మంది ప్రమోటర్లకు
-తెలంగాణ రెరా అథారిటీ సమాచారం

రెరాలో తుది గడువు సమీపించే కొద్దీ.. కొందరు ప్రమోటర్లు కాస్త తెలివిగా వ్యవహరించారు. రెరాకు దరఖాస్తు చేసుకోవడం ఆలస్యమైతే, అనవసరంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని భావించారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి పత్రాల్లేకున్నా.. తెల్ల కాగితాల్ని అప్‌లోడ్ చేసి.. ఫీజును కట్టేసి చేతులు దులిపేసుకున్నారు. ఇలా, సరైన పత్రాల్లేకుండా రెరాకు దరఖాస్తు చేసిన 589 మంది ప్రమోటర్లకు.. తెలంగాణ రెరా అథారిటీ ఏడు రోజుల గడువునిచ్చింది. పూర్తి స్థాయి పత్రాల్ని అందజేసి, వారి ప్రాజెక్టులను నమోదు చేసుకోవాలని తెలియజేసింది.
TS-RERA
రెరాకు దరఖాస్తు చేసి అరవై రోజులైనా కొందరు ప్రమోటర్లు స్పందించడం లేదు. పూర్తిస్థాయి పత్రాలతో తమ లేఅవుట్లు, నిర్మాణాల్ని నమోదు చేసుకోవడం లేదు. అందుకే, వీరందరూ ఏడు రోజుల్లోపూ రెరాలో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలంగాణ రెరా అథారిటీ సమాచారాన్ని అందజేసింది. ఒకవేళ, వీరు స్పందించకపోతే మరోసారి అవకాశమిస్తారు. హియరింగ్ నోటీసును అందజేస్తారు. అప్పటికీ, రాకపోతే గనక వారి దరఖాస్తును రద్దు చేస్తారు. అట్టి సంస్థలు మళ్లీ అపరాధ రుసుమును చెల్లించి.. తమ ప్రాజెక్టులను నమోదు చేయాల్సి ఉంటుంది. మరి, జరిమానా నుంచి తప్పించుకోవాలంటే, ప్రతిఒక్క ప్రమోటర్ తక్షణమే స్పందించాలని తెలంగాణ రెరా అధికారులు కోరుతున్నారు.

వివాదాలకు పరిష్కారం ఇలా..

మహారాష్ట్ర రెరా అథారిటీ నుంచి స్ఫూర్తిగా తీసుకుని.. మన తెలంగాణ రెరా అధికారులు సైతం వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించారు. కొనుగోలుదారులకు డెవలపర్లతో ఎలాంటి సమస్యలు ఏర్పడినా.. ముందుగా ఈ యంత్రాంగం వద్దకొస్తుంది. దీనికి ఛైర్మన్‌గా రెరా మెంబర్ సెక్రెటరీ వ్యవహరిస్తారు. ఇందులో డెవలపర్ల తరఫున నిర్మాణ సంఘాల ప్రతినిధులుంటారు. వీరిని నియమించటానికి ఇప్పటికే తెలంగాణ రెరా అథారిటీ క్రెడాయ్ తెలంగాణ, ట్రెడా వంటి సంఘాల అధ్యక్షులకు సమాచారాన్ని అందించింది. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సంఘాల నుంచి ఐదారుగురు ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. కొనుగోలుదారుల తరఫున కొందరు సభ్యులు ఈ యంత్రాంగంలో ప్రాతినిధ్యం వహిస్తారు. కొనుగోలుదారులకు రియల్టర్లపై ఎలాంటి ఫిర్యాదులున్నా.. ముందుగా ఇక్కడే పరిష్కరించేందుకు దృష్టి సారిస్తారు. ఒకవేళ, ఇక్కడ వెలువడే నిర్ణయాన్ని ఇద్దరిలో ఎవరూ అంగీకరించకున్నా.. అట్టి సమస్య తెలంగాణ రెరా వద్దకెళుతుంది. అక్కడ సమస్యకు పరిష్కారం లభించకపోతే, కొనుగోలుదారులు తెలంగాణ రెరా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదులు..

రెరా సభ్యులతో కొనుగోలుదారులకు ఎలాంటి సమస్యలున్నా.. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ రెరా అథారిటీ పోర్టల్‌లో ప్రత్యేక ఫిర్యాదుల మాడ్యుల్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇది అతిత్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

19 మంది ప్రమోటర్లకు

రెరా షోకాజ్ నోటీసులను జారీ చేసింది. వారి నుంచి స్పందన రాకపోతే, ఆయా ప్రమోటర్ల పేర్లను పత్రికల్లో ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నది.

404
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles