సమయం వృథా చేయకండి


Fri,March 1, 2019 01:35 AM

flight
కనెక్టింగ్ ైఫ్లెట్స్ కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటాయి. ైఫ్లెట్ ఆలస్యానికి కారణాలు చాలా ఉంటాయి. ఆ ఆలస్యంతో మనకు లభించే సమయం చాలా విలువైంది. సమయం ఎప్పుడూ విలువైందే. అయితే విమానా శ్రయంలో బోర్ ఫీల్ అవుతూ ఒకేచోట కూర్చోవడం కాదు. వీలైతే ఈ పనులు చేయండి. ఎయిర్‌పోర్ట్‌లో ఖాళీగా కూర్చుని ఏం చేయాలో అర్థంకాక తలపట్టుకుంటుంటారు. ఏమీ తోచక సమయాన్ని వృథా చేస్తుంటారు. ప్రియమైన ప్రయణికులారా.. ఈసారి నుంచి ైప్లెట్ ఆలస్య మైనా, వెయిటింగ్‌లో ఉన్నా ఇలా చేయండి. మీ ప్రయాణాన్ని సుఖవంతంగా కొనసాగించండి.అంతర్జాతీయ విమానాశ్రయాల్లో చూడాల్సినవి చాలా ఉంటాయి. ఆయా ప్రాంతాలకు చెందిన ఆయా కట్టడాలు వాటికి సంబంధించిన వివరాలు అక్కడ ప్రదర్శిస్తారు. ఆ ఖాళీ సమయంలో అవి చూస్తే సరిపోతుంది. మరి ఎక్కువ సేపు సమయం ఉంటే దగ్గరలో ఉన్న చూడాల్సిన ప్రాంతాలకు వెళ్లి చూసిరండి. వెయిటింగ్‌కు వెయిటింగ్ అవుతుంది. ఒక కొత్త ప్రదేశాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది.

పుస్తక పఠనం..

bookss
చాలామంది విమానయానం చేస్తున్నప్పుడు నిద్రపోతారు. మొదటిసారి ఎక్కినవారు ఫొటోలు తీస్తూ సందడి చేస్తారు. తక్కువ మంది పుస్తకాలు చదువుతారు. హ్యాండ్‌బ్యాగ్‌లో పుస్తకం ఉంటే ప్రయాణంలో వెయిటింగ్ సమయంలో పుస్తకాలు చదవడం మంచి అలవాటు. ఒకవేళ పుస్తకం తీసుకెళ్లకపోయినా మొబైల్‌లో ఎయిర్‌పోర్ట్‌లో వైఫై కనెక్ట్ చేసుకొని ఆన్‌లైన్ బుక్స్ చదవండి. డౌన్‌లోడ్ చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కూడా చదువుకోవచ్చు.

వాకింగ్..

walking
ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఏం రాదు. చిరాకు తప్ప. కాస్త లగేజీ జాగ్రత్తగా పెట్టి నడవండి. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న విషయాలు,విశేషాలు తెలుస్తాయి. ఉదాహరణకు వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద చేపల ఎక్వేరియం ఉన్నది. శాన్‌ఫ్రాన్సిస్‌కో విమానాశ్రయంలో ప్రముఖ మ్యూజియం ఉన్నది. ఇలా ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వెళ్లి ఓ లుక్కేయండి. ఒక్క వాకింగ్ వల్ల వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం ఇలా ఎన్నో లాభాలున్నాయి.

లోకల్ షాపింగ్..

shoping
ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ఒక ప్రత్యేక కళలుంటాయి. వాటికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. అవి విమానాశ్రయాల్లో అమ్మకానికి పెడతారు. చేతివృత్తుల కళాకారులు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటారు. అక్కడి కళలకు సంబంధించిన వస్తువులు, పెయింటింగ్‌లు, హ్యాండీక్రాఫ్ట్స్, డిజైన్స్ వంటివి వీలైతే షాపింగ్ చేయండి. మీరు కొనే చిన్న వస్తువులే అయినా వాటికి ఇక్కడ విలువ ఎక్కువ ఉంటుంది.

అలంకరణ..

food
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్పాలు, సెలూన్‌లు,మసాజ్ సెంటర్లు ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో మంచి సర్వీస్‌లు కలిగిన స్పాలు ఉంటాయి. అప్పటికే ప్రయాణం చేసి అలసిపోయినా, ప్రయాణం చేయకపోయినా సరదాగా స్పాకు వెళ్లి బాడీ మసాజ్, ఫేస్‌వాష్ వంటివి చేయించుకోండి. సమయం మిగులుతుంది. మీ అలంకరణ జరుగుతుంది.

వ్యాయామం

saloon
ఎయిర్‌పోర్ట్‌లో ఎక్సర్‌సైజ్ ఏంటని ఆశ్చర్యపోకండి. ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో హోటల్స్ ఉంటాయి. ప్రతి హోటల్‌లో జిమ్, ఫిట్‌నెట్ సెంటర్ ఉంటాయి. కొన్నింటిలో హోటల్‌కు వచ్చిన అతిథులకే కాకుండా సాధారణ కస్టమర్లకు కూడా ఎంట్రీ ఉంటుంది. దాదాపు అన్ని జిమ్‌లు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి. కాబట్టి జిమ్‌కెళ్లి వర్కవుట్స్ చేయండి. ఇదొక మరిచిపోలే ని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ఆహారం..

exarcise
ప్రతి విమానాశ్రయంలో ఫుడ్‌కోర్ట్ ఉంటుంది. కాఫీషాప్‌లు, రెస్టారెంట్‌లు పసందైన ఆహారాన్ని అందిస్తాయి. ఏ దేశానికి వెళ్లినా ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అక్కడి ఆహారాన్ని రుచి చూడండి. మితంగా తీసుకుంటే మంచిది. అలవాటు లేని ఆహారం కాబట్టి ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు. కనుక ఆ మేరకు జాగ్రత్త పడండి.

508
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles