సబ్జా గింజలు.. ఎంతో మేలు!


Mon,March 25, 2019 01:34 AM

సబ్జా గింజలు నీటిలో వేసిన కొంతసేపటికి జెల్‌లా మారిపోతాయి. అవి చూసేందుకు చిన్నవిగా ఉన్నా అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.
sabja-ginjalu
-అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి సబ్జా గింజలు చక్కని ఔషధం. వీటిని స్వల్ప పరిమాణంలో తిన్నా చాలు. త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిని తిన్న తర్వాత ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.
-సబ్జా గింజలు నేరుగా కాకుండా నీటిలో వేసుకొని తింటే జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా తొలిగిపోతాయి.
-సబ్జా గింజలను పొడి చేయాలి. దాన్ని గాయలపై వేసి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఇన్‌ఫెక్షన్లు కూడా ధరి చేరనివ్వవు.
-సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే దూరమవుతుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న వారు ఇలా చేయడం వల్ల సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
-రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు సబ్జా గింజల్లో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగవుతుంది. బీపీ కూడా అదుపులో ఉంటుంది.
-గోరువెచ్చని నీటిలో తేనె, అల్లం రసం కలిపి దాంతోపాటు కొన్ని సబ్జా గింజలు కూడా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి.
-నీటిలో వేసిన సబ్జా గింజలు తినడం వల్ల డిప్రెషన్ వెంటనే దూరమవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. తరచూ ఆహారంలో భాగంగా వీటిని తింటే మంచిది.
-యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ గుణాలు సబ్జా గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
-కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు సబ్జా గింజలు తింటే ఫలితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే తగ్గిపోతాయి.
-ఉదయాన్నే సబ్జా గింజల్ని నీటిలో వేసుకొని తింటే ఎంతో శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

931
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles