సపోటాతో ఆరోగ్యం


Sat,March 9, 2019 12:39 AM

Sapota
-సపోట పండ్లలో ప్రక్టోజ్, సుక్రోజ్, చక్కెర సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు సపోటాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సపోటాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఇందులో పొటాషియం, మెగ్నీషియం గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
-సపోట పండ్లను తరచూ తింటే దృష్టి లోపాలు కూడా దూరమవుతాయి. రోజూ ఒక పండు చొప్పున తింటూ ఉంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
-సపోటాలో రక్తవృద్ధి, దాతుపుష్టిని కలిగించే అంశాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అంతే కాదు సపోటాలో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు లభిస్తాయి. కాల్షియం, పొటాషియం, కెరొటనాయిడ్లు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉన్నాయి.
-యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. సపోటాలో విటమిన్-ఏ, విటమిన్-పి ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతే కాకుండా సపోటాను రోజూ తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.

621
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles