సడలని ధైర్యంతో పుల్వామాలో విధులు


Wed,March 6, 2019 02:43 AM

ఫిబ్రవరి 14 న జరిగిన పుల్వామా ఉగ్రదాడి ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నేటికీ ఆ ఘటన దేశ ప్రజలను వెంటాడుతూనే ఉంది. సైనికుల ప్రాణత్యాగాలను దేశం స్మరించుకుంటూనే ఉంది. ఉగ్రదాడి జరిగిన తర్వాత అక్కడ జరిగిన కర్ఫూలో పురుష సైనికులే కనిపించారు. కానీ మనకు కనిపించని మహిళా సీఆర్‌పీఎఫ్ సైనికులు కూడా అక్కడ విధుల్లో పాల్గొన్నారు..
pulwama
దేశం మొత్తం ఒక్కసారిగా ఉల్లిక్కిపడిన ఘటన... సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి. 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. వెంటనే సైన్యం అక్కడ కర్ఫ్యూ విధించింది. భయానక వాతావరణంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సైన్యం రంగంలోకి దిగింది. బలగాలు ఘటనా స్థలంలోకి చేరుకుని విధుల్లో పాల్గొన్నాయి. తర్వాత వరుసగా ఘటనా స్థలంలోనే ఉండాల్సి వచ్చింది. ఆ బలగాల్లో మహిళా జవాన్లు కూడా ఉన్నారు. అయితే కొందరు మహిళా జవాన్లు పుల్వామా దాడిని ప్రత్యక్షంగా చూసిన వాళ్లే. అయినా ఎలాంటి భయాందోళనకు గురవకుండా అక్కడే వారి తక్షణ కర్తవ్యాన్ని నిర్వహించారు. పూర్తి ధైర్య సాహసాలతో కర్ఫ్యూ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టారు. ఈ భయంకర సమయంలోనూ సడలని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్న వీరిని ఓ ఇంగ్లిష్ పత్రిక పలకరించింది. ఈ సంభాషణను వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచింది. దాంట్లో రిపోర్టర్ అడిగిన సమాధానాలకు ఓ మహిళా జవాను ఇలా సమాధానం చెప్పారు. దాడి జరిగిన రోజు నా పిల్లలు భయాందోళనకు గురయ్యారు. అయినా నాకు వాళ్లు మద్దతునిచ్చారు. విధినిర్వహణలో నా బాధ్యతను నిర్వర్తించాలని ధైర్యాన్ని ఇచ్చారు. విధులు పూర్తి అయిన తర్వాత క్షేమంగా ఇంటికి రావాలన్నారు. అంటూ ఓ మహిళా జవాను స్పందించింది. మరో జవాను స్పందిస్తూ కర్ఫ్యూ పరిస్థితిపై నా కుటుంబం బాధపడుతుంది. దాడిని తెలుసుకుని ఆవేదనకు లోనైంది. భయానకమైన పరిస్థితిని చూసి దిగులు పడింది అని తెలిపింది. మీరు సీఆర్‌పీఎఫ్‌లో ఎందుకు చేరారు? అన్న రిపోర్టర్ ప్రశ్నకు నా దేశం కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశ్యంతో సీఆర్‌పీఎఫ్‌లో చేరాను అని సమాధానం ఇచ్చింది. తమ కండ్ల ముందు ఈ దాడి జరిగిందని, తమ రక్తం ఉడుకుతుందని ఇతర బృందంలోని జవాన్లు కెమెరా ముందు వివరించారు.

421
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles