షేక్‌పేట్‌లో.. అపర్ణా వన్


Sat,February 9, 2019 02:03 AM

-నగరంలో అతి ఎత్తయిన ఆకాశహర్మ్యం
-3.6 మీటర్ల సీలింగ్ హైటుతో.. 36 అంతస్తుల అపర్ణా వన్
-2022లోపు ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం

Aparna-One-Minature
షేక్‌పేట్‌లో అపర్ణా వన్ అనే అత్యాధునిక ఆకాశహర్మ్యానికి అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ శ్రీకారం చుట్టింది. దాదాపు 9.75 ఎకరాల విస్తీర్ణంలో.. ఆరు బ్లాకుల్లో.. 464 లగ్జరీ ఫ్లాట్లను నిర్మిస్తున్నది. 25, 30, 36 అంతస్తుల ఎత్తులో ఆరు టవర్లను నిర్మిస్తోంది. ఎంపరర్ టవర్స్‌లో రెండు టవర్లను 36 అంతస్తు ఎత్తులో కడతారు. 30 అంతస్తుల ఎత్తులో మరో రెండు టవర్లు, నోబుల్ టవర్లను 25 అంతస్తుల ఎత్తులో కడతారు. ఫ్లాట్ల సైజులు 2,876 చ.అ. నుంచి 5,216 చ.అడుగుల దాకా ఉంటాయి. ఒక్కో ఫ్లాట్ ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. అంటే, 2,876 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ కోసం.. చదరపు అడుక్కీ రూ.10,000 దాకా ఖర్చవుతుందని అంచనా. ప్రతి ఫ్లాటులో వాయిస్ ఆధారిత స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్ ఉంటుంది. దీని వల్ల ప్రతి ఫ్లాట్‌లో నివసించేవారు.. కేవలం తమ ఆజ్ఞల ద్వారా లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, గీజర్, వీడియోను నియంత్రించొచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ.. ఇంట్లోకి అపరిచితుల్ని జొరబడకుండా చేయవచ్చు. మొత్తానికి, ఆధునికతకు అద్దంపట్టే మహానిర్మాణమే.. అపర్ణా వన్.

అతి ఎత్తయిన నిర్మాణం

అపర్ణా వన్ ప్రాజెక్టు టెక్నాలజీ ఆధారంగా నిర్మిస్తున్న అత్యాధునిక ఆకాశహర్మ్యం. 3.6 మీటర్ల సీలింగ్ ఎత్తుతో అతి ఎత్తయిన రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా ఖ్యాతినార్జిస్తుంది. ఇందులోని అమెనిటీస్ గోల్ఫ్ కోర్సు వైపు ఉంటాయి. ప్రత్యేకమైన కిటికీలను అమర్చడం వల్ల బయట్నుంచి శబ్ద కాలుష్యం అనేది ఉండనే ఉండదు. ప్రతి ఫ్లాటులో పని మనిషి కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తారు. ఎంపరర్ టవర్స్‌లో అయితే ప్రైవేటు హోమ్ థియేటర్ గదిని అందజేస్తున్నారు. ఇది ఐజీబీసీ ప్రీ-సర్టిఫైడ్ ప్లాటినం ప్రాజెక్టు కావడం వల్ల పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణ సామగ్రిని వినియోగిస్తారు.

65 వేల చదరపు అడుగుల్లో.. క్లబ్‌హౌజ్..

ఈ ప్రాజెక్టును షీర్‌వాల్ టెక్నాలజీతో నిర్మిస్తారు. ఇందులోని ఆధునిక సదుపాయాలన్నీ గోల్ఫ్‌కోర్సు వైపుగా ఉంటాయి. సుమారు 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌజ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో టెన్నిస్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు, బాస్కెట్‌బాల్ కోర్టులు, క్రికెట్ పిచ్ వంటివి పొందుపరుస్తారు. 80 శాతం ఖాళీ స్థలంలో.. డిజైనర్ ల్యాండ్ స్కేపింగ్ భలే అందంగా ఉంటుంది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లకు అతి చేరువగా ఉన్న ఈ ప్రాజెక్టులో కొనుగోలుదారులకు సంపూర్ణ భద్రతను అందించేందుకు సైబర్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టుల్లో జాగింగ్ ట్రాకును ఏర్పాటు చేయడం సహజమే. అయితే, అపర్ణా వన్‌లో ప్రత్యేకంగా సైకిల్ ట్రాకును పొందుపరుస్తారు.

ధర.. చదరపు అడుక్కీ రూ.10,000?

6.5 కోట్ల చ.అడుగుల్లో నిర్మాణాలు
22 ఏండ్ల నుంచి నిర్మాణ రంగంలో 38 ప్రాజెక్టులను పూర్తి చేశాం. రెండు కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేశాం. ప్రస్తుతం ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వీటి విస్తీర్ణం.. ఎంతలేదన్నా కోటీ ఇరవై లక్షల చదరపు అడుగుల దాకా ఉంటుంది. ఇదే ఏడాదిలో మరో రెండున్నర కోట్ల చదరపు అడుగుల్లో కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించడానికి ప్రణాళికల్ని రచిస్తున్నాం. అంతా కలిపితే, వచ్చే నాలుగేండ్లలో ఆరున్నర కోట్ల చదరపు అడుగుల్లో ప్రాజెక్టుల్ని చేపడుతున్నాం. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్ల విషయానికొస్తే.. హైదరాబాద్లో రెండు నిర్మిస్తున్నాం. ఇవి నలగండ్ల, రాజేంద్రనగర్‌లో కడుతున్నాం. విజయవాడలో ఒకటి, వరంగల్‌లో మరోటి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇక, వాణిజ్య సముదాయాల విషయానికొస్తే.. ఈ ఏడాది దాదాపు మూడు నుంచి మూడున్నర కోట్ల చదరపు అడుగుల్లో చేపడతాం.
- డీఎస్ ప్రసాద్, డైరెక్టర్, అపర్ణా కన్‌స్ట్రక్షన్స్

రూ.9 వేల కోట్ల విలువ గల ప్రాజెక్టులు..

అపర్ణా అంటేనే నాణ్యమైన నిర్మాణాలకు మారుపేరు. మా ప్రాజెక్టులో ఆనందంగా నివసిస్తున్న కొనుగోలుదారులకే ఇందుకు నిదర్శనం. దక్షిణ భారతదేశంలోనే ఎ- రేటింగ్ గల నిర్మాణ సంస్థగా ఖ్యాతినార్జించాం. మొత్తానికి రూ.9 వేల కోట్ల విలువ గల ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రణాళికల్ని రచించాం. తమ కొనుగోలుదారుల్లో 35 శాతం ప్రవాసులే ఉంటారు. మిగతా వారంతా ఐటీ ఉద్యోగులు, వృత్తి నిపుణులు వంటివారున్నారు. మా వద్ద ఎంతలేదన్నా ప్రస్తుతం వెయ్యి ఎకరాల దాకా ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం ప్రకటించిన అపర్ణా వన్ ఆధునిక కొనుగోలుదారులకు ఇట్టే నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో బుకింగులను ఈ నెల పదో తేది నుంచి ఆరంభిస్తాం.
- రాకేష్‌రెడ్డి, డైరెక్టర్, అపర్ణా కన్‌స్ట్రక్షన్స్

561
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles