షుగర్.. నో ఫికర్!


Fri,June 12, 2015 12:32 AM

doctor

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న మధుమేహ వ్యాధిని పూర్తిగా నయం చేసే ఔషధాన్ని స్పెయిన్ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. ఇది త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఔషధం టైప్-1 మధుమేహాన్ని కూడా నయం చేస్తుందట. రెండేళ్ల క్రితం చుంచులపై మొదలుపెట్టిప టైప్-1 డయాబెటీస్ నిరోధక ఇమ్యునోథెరపీలో విజయం సాధించిన యూనివర్సిటీ ఆటోనోమా డీ బార్సి శాస్త్రవేత్తలు.. స్పెయిన్ విద్యార్థులు చేస్తున్న రీసెర్చ్‌కు కూడా సహకరించారు. మధుమేహాన్ని నిమయంత్రించే దిశగా, ఇన్సులిన్‌ను నాశనం చేసే పాంక్రియాటిక్ కణజాలాన్ని పెంచే యత్నాలకు బదులు, వ్యక్తి రక్తంలో ఉండే డెండ్రిటిక్ కణాలను మధుమేహాన్ని అధిగమించే శక్తిని అందిచే దిశగా ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి. డెండ్రిటిక్ కణాలను బలోపేతం చేసేందుకు లిపోసోమ్స్ పేరిట ప్రయోగశాలలో సృష్టించబడ్డ నానో పార్టికల్స్ వాడారు. ఈ లిపోసోమ్స్‌ను శరీరంలోకి పంపిస్తే అవి మధుమేహ పెరగకుండా అడ్డుపడతాయట.

9204
Tags

More News

VIRAL NEWS