శ్రమ తక్కువ.. శుభ్రత ఎక్కువ


Thu,January 3, 2019 12:39 AM

సాధారణంగా ప్యాంట్లు త్వరగా మురికి పడుతాయి. వాటి మురికి వదిలించాలంటే కొన్ని చిట్కాలు మీకోసం.
cleaning
-రోడ్డు మీద నడుస్తుంటే వాహనాల బురద, మురికి గుంటల్లో ఉండే బురదనీరు బట్టలపై పడుతుంటుంది. వెంటనే తుడిచే ప్రయత్నం చేయవద్దు. వీలైనంత సమయం ప్యాంట్‌ను హ్యాంగర్‌కు తగిలించి ఆరబెట్టాలి.
-ఎండలో ఆరబెట్టిన ప్యాంటును తీసుకొని మరక ఆరిందా లేదా చూడాలి. ఎండిన తరువాత దానిని ఉతక్కూడదు. వాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించి బురదను ప్యాంట్ నుంచి తొలిగించండి.
-గోరువెచ్చని నీటిలో డిటర్జంట్ పౌడర్ కలుపాలి. అందులో ప్యాంట్‌ను 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేస్తే బురద మరకలు తేలికగా పోతాయి.
-వేడినీటిలో ఉన్న ప్యాంట్‌ను బయటకు తీసి డిటర్జెంట్‌తో ఉతకాలి. బురద పోయిందో లేదో చూడండి. ఒకవేళ పోకుంటే మరల ఉతకండి.
-బట్టలపైన మరకలను తొలిగించడానికి నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. సగానికి కోసిన నిమ్మకాయను మరకపై రుద్ది మరకను తొలిగించవచ్చు.
-నీటిలో బేకింగ్‌సోడా కలిపి మరక ఉన్న బట్టను నానబెట్టాలి. 20 నిమిషాల తరువాత డిటర్జెంట్‌తో ఉతికితే మరకలు సులువుగా పోతాయి.

626
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles