శృతి చిత్రాలు


Tue,March 12, 2019 01:28 AM

Shruti
మనచుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ.. అందులోని వ్యర్థాలను అందమైన ఆకృతులుగా మలుచడం అద్భుతమైన కళ. అలాంటి కళా నైపుణ్యంతో పనికిరావు అని పారేసిన వస్తువులతో అద్భుతాలను సృష్టిస్తున్నది శృతి శ్రీపాద. ఆమె పరిచయం

ఇదిగో..


ఖాళీగా కూర్చోవడం కన్నా.. తనలోని టాలెంట్‌కి పదును పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచించింది శృతి. తనకు తెలిసిన కళను డిఫరెంట్‌గా ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ సహాయంతో రాణిస్తున్నది. ఖాళీ గాజుసీసాలు, గుడ్డు పెంకులు, ఖాళీ

మద్యం సీసాలు, మట్టిదివ్వెలకు తన కళను అద్ది వినూత్నంగా మారుస్తున్నది. సరదాగా మొదలుపెట్టినప్పటికీ అందులో మజా ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. ఎక్కడ ప్రత్యేకంగా ఆర్ట్ నేర్చుకోకపోయినా.. తనకు పరిచయం ఉన్న కాసింత కళ గురించి

మరింత తెలుసుకోవాలనుకుంది. కొత్తగా ఏదైనా చేయాలన్న ఉత్సాహం, తెలుసుకోవాలన్న ఉత్సుకత ఆమెను కొత్తబాటలో నడిపించింది. బాటిల్ పెయింటింగ్, ఎగ్‌షెల్స్ పెయింటింగ్‌లలో సరికొత్త పోకడలను పరిచయం చేసింది. ఇంటర్నెట్ సాయంతో వాటి

గురించి లోతుగా అధ్యయనం చేసింది. వినూత్న ఆకృతులు గల సీసాల మీద తన ఆర్ట్ పరిచి కొత్త రూపు, సరికొత్త అందాన్ని తెస్తున్నది. ఖాళీ అయిన తర్వాత అవతల పారేసే సీసాలను షెల్ఫ్‌లో అందంగా అలంకరించుకునేలా మారుస్తున్నది.


- ఉమెన్స్ ఇంటర్నేషనల్ అవార్డు-2018
- బెస్ట్ ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు - 2018.
- నల్లమల్లి ఆదర్శ మహిళ చారిటబుల్ ట్రస్ట్ వారిచే మహిళా
ఎంటర్‌ప్రెన్యూర్, ఆదర్శ మహిళగా అవార్డు - 2019.

Shruti2వరంగల్‌కి చెందిన శృతి శ్రీపాదకు చిన్నప్పటి నుంచే ఆర్ట్ అంటే ఆసక్తి. అది కాస్త బీఎస్సీ మైక్రో బయాలజీ చేసేటప్పుడు ఎక్కువైంది. కోర్సులో భాగంగా పలు చిత్రాలు వేయాల్సి వచ్చేది. వివిధ ఆకృతుల్లో ఉన్న ఆ బొమ్మలు వేస్తుంటే శృతికి ఇలాంటి బొమ్మలు ఆర్ట్‌లో ఎందుకు ప్రయోగించకూడదు అని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా ప్రయోగాత్మకంగా ఖాళీ మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిల్స్ మీద పురాతన ఆర్ట్‌ని రంగులతో మేళవించి అలంకరించింది.అవి చూసి శృతి వాళ్ల తల్లిదండ్రులు, స్నేహితులు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఆ మాట శృతిలో ఉత్సాహాన్ని పెంచింది. వివిధ ఆకృతుల్లో ఉన్న గాజు సీసాలు సేకరించడం మొదలుపెట్టింది. వాటి మీద ఆర్ట్ వేసి అందమైన షోకేజ్ వస్తువులుగా మార్చింది. అవసరం లేదనుకొని చెత్తలో పారేసిన బాటిల్స్ అందమైన అలంకార వస్తువులుగా మారడంతో చాలామంది తమకు కూడా అలాంటివి కావాలని అడిగారు. అంతే.. అప్పటి నుంచి ఆ ఆర్ట్‌ని కొనసాగిస్తున్నది. కోడగుడ్డులోని పచ్చసొన,తెల్లసొన తీసేసి దాని మీద సన్నటి గీతలతో శృతి వేసే ఆర్ట్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. దీపావళికి పెట్టే మట్టి దివ్వెలను వివిధ ఆకృతుల్లో తయారుచేసి సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేసింది. అవి కాస్త ఆకట్టుకునేలా ఉండడంతో చాలామంది అలాంటివి తమక్కూడా కావాలి అని అడుగడంతో పెద్ద సంఖ్యలో ప్రమిదలను అలంకరించి కోరిన వారికి ఎగుమతి చేసింది. ఇతర రాష్ర్టాల నుంచి సైతం శృతి చేసిన మట్టిదివ్వెలు అడిగి మరీ కొనుక్కున్నారంటే ఆమె ఆర్ట్ శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Shruti1

ప్రొఫైల్

వరంగల్‌కి చెందిన శృతి శ్రీపాద బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీఎస్సీ మైక్రో బయాలజీ చేసింది. ఐసీఎఫ్‌ఏఐ పంజాగుట్టలో ఎంబీఏ హెచ్‌ఆర్ డిప్లొమా చదివింది. 2014లో శృతి శ్రీపాదక్రియేషన్స్ పేరుతో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి తను తయారుచేసిన కళాకృతులతో http://www.shruthisripadacreations.com/ పేరుతో వెబ్‌సైట్ కూడా నిర్వహిస్తున్నది. పురాతన, కాంటెపరరీ ఆర్ట్‌లో శ్రీపాద దిట్ట. గాజుసీసాలు, గుడ్డు పెంకుల మీద శృతి వేసే ఆర్ట్ ఆకట్టుకుంటుంది. 2011 నుంచి ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నది. వ్యర్థాలతో ఆకట్టుకునే అందమైన కళాకృతులు చేయడం శృతికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే రకరకాల డిజైన్లలో ఉండే సీసాలు, మద్యం సీసాలు సేకరించి వాటిని రంగులతో అలంకరించి ఆర్ట్ వేసి వాటికి కొత్త రూపు తెస్తున్నది.


- ప్రవీణ్‌కుమార్ సుంకరి

551
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles