శిక్షణ ఇచ్చిన ధైర్యం


Sat,March 2, 2019 12:30 AM

నిత్యం బుల్లెట్లు.. తుపాకుల నీడలోనే విధుల నిర్వహణ..దేశం కోసం ప్రాణాలివ్వడమే కాదు.. దేశం జోలికొస్తే శత్రువుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ధైర్యసాహసాలు..శత్రుచెరలో చిక్కినా పెదాల మీద నవ్వు చెదరదు.. గుండెల్లో ధైర్యం ఇంకదు.. అది సుశిక్షిత భారత సైనికుడి లక్షణం..ఆనాడు నచికేత, ఈనాడు అభినందన్ ఇద్దరూ అభినందనీయులే.. ఈ గడ్డ మీద పుట్టిన వీరకిశోరాలే.. వారిని జాతి అభినందిస్తున్నది.. గుండెలు పొంగగా గర్విస్తున్నది..మన సైనికా.. సలామ్!
నచికేత కార్గిల్ సమయంలో పాక్ సైనికుల అహంకారాలను నరికివేయాలనే బయలుదేరాడు. దురదృష్టవశాత్తు విమానం కూలి దొరికిపోయాడు. ఏడురోజులు పాక్‌లో జైలులో ఉండి వీరభారత సైనికుడుగా విడుదలయ్యాడు. వాళ్ల ఇగోలను, కుళ్లును నరికివేశాడు.ఆయనే నచికేత.

nachiketa

అభినందన్.. అభినందన్

అభినందన్.. అభినందన్.. ఏ ఇద్దరు కలిసినా, ఏ సైట్ వెతికినా, ఎవరిని టచ్ చేసినా ఇదే అంశం..చర్చనీంయాంశం. పాకిస్థాన్‌లో చిక్కుకున్న మన కమాండర్ క్షేమంగా రావాలని అందరూ కోరుకున్నారు. అన్ని ప్రయత్నాలు ఫలించాయి. శుక్రవారం సాయంత్రం వాఘా బార్డర్‌లో సురక్షితంగా అభినందన్‌ను అప్పగించి వెళ్లారు పాక్ సైనికాధికారులు. ఆయనకు దేశం మొత్తం ఘనస్వాగం పలికింది. కొందరు కంటతడి పెట్టుకొని గర్వపడుతుంటే ఇంకొందరు పిడికిలి బిగించి, రొమ్ము విరిచి, జబ్బ చరిచి నినదించారు. ఇదంతా బాగుంది. ఇప్పుడంటే అభినందన్ వచ్చేసాడు. అభినందన్ లాగానే కార్గిల్ యుద్ధ సమయంలో కెప్టెన్ కంబంపాటి నచికేత కూడా ఇలాగే పాకిస్థాన్ చేతుల్లో చిక్కాడు.

1999 కార్గిల్ యుద్ధం జరుగుతున్నది. న్యూఢిల్లీలో అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ భారత వైమానిక దళానికి సంబంధించిన మిగ్-21 బైసన్ కనిపించడం లేదని ప్రకటించారు. మిగ్ 21 యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్ నచికేత, సాంకేతిక కారణాల వల్ల ఆ విమానం నుంచి కిందికి దూకాడు. ప్యారాచూట్ సహాయంతో దూకాడు. అప్పటికీ నచికేత వయస్సు 26 ఏండ్లు. ప్రాణాలతో బయటపడ్డాడని సంతోషపడే లోపు.. అది ఆక్రమిత పాకిస్తాన్ భూభాగమని తెలుసుకున్నాడు. ఆ దేశ సైనికులు నచికేతను పట్టుకున్నారు. మొదట ఎవరినీ పట్టుకోలేదని బుకాయించిన పాక్ సైనికులు అంతర్జాతీయ మీడియా ఒత్తిడికి ఒక మెట్టు దిగొచ్చింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని ఒప్పుకొన్నది. నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసినా నచికేత అదరలేదు. బెదరలేదు. చిత్రహింసలకన్నా ఒకేసారి ప్రాణాలు తీసేస్తే బాగుండేదని నచికేత తన అనుభవాలను చెప్పాడు. నచికేత విడుదల కోసం భారత ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హై కమీషనర్ పార్థసారథి చొరవతో చర్చలు జరిగాయి. ఉత్కంఠకు తెరలేపిన ఆ ప్రయత్నం సఫలం అయింది. నచికేతను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది పాక్ ప్రభుత్వం. నచికేత విడుదయ్యాడు. దేశ రక్షణ కోసం వాయుదళంలో సేవలందిస్తున్న నచికేతను మన ప్రభుత్వం అధికార లాంఛనాలతో స్వాగతం పలికి ఆదరించింది. నచికేత గతేడాది పదవీ విరమణ పొందాడు. కార్గిల్ సమయంలో జరిగిన సంఘటనలను, అనుభవాలను, అక్కడ ఎదుర్కొన్న హింసాత్మక చర్యలను ఆయన ఇలా వివరించాడు.
nachiketa1

అభినందన్ విడుదలయ్యాడు. ఇంత త్వరగా విడుదలవుతాడని అనుకున్నారా?

అభినందన్‌ను త్వరలో విడిపించండి అని కేంద్రానికి లేఖ కూడా రాశాను. ముందే ఊహించాను. మంచి మనుషులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. తన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. సాటి సైనికుడిగా గర్వపడుతున్నాను. వెనక్కి వచ్చిన అభినందన్ ధైర్యంగా, ధృడంగా మరలా ఉద్యోగంలో చేరి దేశ సేవ చేయాలని కోరుకుంటున్నా.

పాకిస్తాన్‌లో చిక్కుకున్నప్పుడు ఏమనిపించింది?

నన్ను పాకిస్థానీయులు బంధించినప్పుడు జీవితమంతా ఒక్కసారి కళ్లముందు కనిపించింది. ఒక యుద్ధవీరుడు తన జీవితంలో ఎక్కువ రోజులు సాఫీగా సాగించలేడు. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిసి కూడా రక్షణ రంగంలోకి వెళ్లాను. కారణం.. దేశానికి సేవ చేసే అదృష్టం అందరికీ రాదు. అదృష్టం కంటే దేశసేవ పౌరుడిగా నా బాధ్యత. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ వారికి వారు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకోవాలి. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఇండియన్ ఆర్మీ ఇచ్చిన శిక్షణ బాగా ఉపయోగపడుతుంది.

మీరు తీసుకున్న శిక్షణ ఎలా ఉండేది? ఆ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నారు?

ఇప్పుడంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సోషల్‌మీడియా పుణ్యమా అని ప్రతి వీడియో నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇప్పటి వీడియో చూసి అప్పటి పరిస్థితుల్ని అంచనా వేసుకోండి. ఆ పరిస్థితుల గురించి, అనుభవాల గురించి నో కామెంట్స్..

మీరు పైలట్ అవ్వడానికి రోల్ మోడల్ ఎవరు?

మొట్టమొదట మన తల్లిదండ్రులే మనకు స్ఫూర్తి. జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ఎదుర్కోగలిగానంటే మా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహమే. తల్లిదండ్రులే నాకు రోల్‌మోడల్.
K-Nachiketa

ప్రతి పైలట్ గాల్లో విహరించాలనుకుంటాడు.
2003లో మూడేళ్ల విరామానికి కారణం ఏంటి?

నిజమే. ప్రతి పని జరగడానికి ఒక సమయం ఉంటుంది. అది అప్పుడే జరుగుతుంది. అదృష్టం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. దాన్ని మనం అర్ధం చేసుకొని ముందుకెళ్లడమే ఉత్తమ లక్షణం.

కార్గిల్ యుద్ధం గురించి?

అది 1999 సంవత్సరం మే 28వ తేదీ. ఊహకు అందని సంఘటనలు. ఏం జరుగుతుందో ఆలోచించేలోపు యుద్ధ సన్నివేశం. అన్నీ చుట్టుముట్టాయి. 17వేల అడుగుల ఎత్తులో 80ఎంఎం రాకెట్లను, మిగ్ 27 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎదుర్కొనే లక్ష్యంతో పోరాడాం. బటాలిక్ ప్రాంతం నుంచి రాకెట్ల వర్షం కురుస్తున్నది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఫెయిల్ అయిందని తెలిశాక మా పని అయిపోయింది అనుకున్నాం. ఎలాంటి అవకాశం లేదు. అన్ని దారులూ మూసుకుపోవడంతో పారాచూట్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. పాకిస్థాన్ అధికారులకు చిక్కిన తర్వాత కూడా పిస్టోల్ ద్వారా కాల్పులు జరిపాను. శత్రువులను అంతమొందించాలని చివరి వరకు పోరాడాను. అక్కడి నుంచి రావల్పిండీ జైలుకు తరలించారు. అక్కడ బందీగా ఉంచారు.

కార్గిల్ యుద్ధ ఖైదీగా వీరోచిత పోరాటం చేసిన నచికేత ఎనిమిది రోజుల తర్వాత విడుదల అయ్యాడు. దేశం ఎప్పుడూ ఇలాంటి వీరులకు రుణపడి ఉంటుంది. అలాంటి వారి త్యాగాలను ప్రజలు హృదయాంతరాలలో పెట్టుకొని చూసుకుంటారు. 2000 సంవత్సరంలో వాయుసేన పతకంతో సత్కరించింది. అందుకే మన సైన్యం.. మనకు ధైర్యం.

రెండు దశాబ్దాల కార్గిల్, మీ అనుభవం గురించి ఏం చెప్తారు?

బాస్టన్(యుద్ధ రీతి) ఒకతరం నుంచి మరొకతరం చేతిలోకి వెళ్తుంది. ఈ ప్రపంచంలో ఎవరి జీవిత చక్రాన్ని వారెవరూ ఆపలేరు. అలాగే చరిత్రను కూడా. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడున్న విజ్ఞానం, మన ముందుతరాల అనుభవాలతో మన ఢిపెన్స్ బాగా అభివృద్ధి చెందింది.

-అజహర్ షేక్
K-Nachiketa1

1150
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles