శాఖాహారులకు ఉచిత టికెట్


Thu,February 7, 2019 01:43 AM

అమెరికన్ సింగర్ బియాన్సే ఇచ్చే ప్రదర్శనలను.. జీవితాంతం ఉచితంగా చూసేందుకు టికెట్లు గెలుచుకునే అవకాశాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నది. ఎందుకో తెలుసా?
biyanse
అమెరికాకి చెందిన బియాన్సే, తన భాగస్వామి జే-జీ ఇచ్చే ప్రదర్శనలను జీవితాంతం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ టికెట్లు ఊరికే రావు. ఇందుకు ఒక షరతు కూడా పెట్టింది. దీని కోసం శాఖాహారం మాత్రమే తినాలి. అందులోనూ గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, ఇతర జంతు సంబంధం లేని వీగన్ పదార్థాలు మాత్రమే తింటానని హామీ ఇచ్చి దానికి కట్టుబడాలన్నది షరతు. పర్యావరణంపై వీగనిజమ్ చూపే సానుకూల ప్రభావాలను ప్రచారం చేసే గ్రీన్ ప్రింట్ ప్రాజెక్ట్ ద్వారా బియాన్సే ఈ పోటీ నిర్వహిస్తున్నది. తాము తినేది మొక్కల నుంచి ఉత్పత్తి అయిన ఆహారం ఎంత ఉందో అభిమానులు తెలుపాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆహార అలవాట్లను పాటించే వారిలో ఒకరికి జీవితకాలం ఉచితంగా తమ ప్రదర్శనలు చూసేందుకు టికెట్లు లభిస్తాయి. గెలుపొందిన వారు మరొకరిని వెంటబెట్టుకొని హాజరు కావొచ్చని బియాన్సే ప్రకటించింది. ఈ పోటీలో కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. జీవితకాలం అంటే 30 యేండ్లు అని కూడా నిబంధన విధించింది. బియాన్సే చాలాకాలం నుంచి వీగన్ ఆహార శైలిని ప్రచారం చేస్తుస్తున్నది. మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలను తినండంటూ పూర్తి సహకారం అందిస్తున్నదని ది వీగన్ సొసైటీ తెలిపింది. మొక్కల నుంచి వచ్చిన ఆహార పదార్థాలతో కూడిన భోజనాన్ని తొమ్మిది సార్లు తింటే, ఒక నెలలో గాలిలోని విషవాయువులను 14 చెట్లు పీల్చుకోవడానికి సరిపడినంత పర్యావరణ ప్రభావం చూపినట్లే అని గ్రీన్‌ప్రింట్ ప్రాజెక్ట్ చెబుతున్నది. 30 యేండ్లు ఉచిత టికెట్ అంటే 8.57 లక్షలకు సమానమని వెబ్‌సైట్ చెబుతున్నది.

655
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles