శనగపిండితో చర్మకాంతి


Sat,April 13, 2019 12:28 AM

besan
-ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్, అరస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఒక స్పూన్ శనగ పిండిలో అరస్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి పట్టించి కాసేపయ్యాక కడిగితే ప్రయోజనం ఉంటుంది.
-క్యారెట్‌లో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపర్చడమే కాకుండా చర్మ కాంతిని కూడా మెరుగుపరుస్తుంది.
-బాగా పండిన అరటిపండులో పావు భాగం తీసుకుని అందులో అరచెంచా రోజ్‌వాటర్, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా వేసుకుని పదినిమిషాల తర్వాత శుభ్రంగా ముఖం కడుక్కుంటే చర్మం ఎంతో మృధువుగా ఉంటుంది.
-నలుపు ఛాయలో ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి పేస్టులా తయారు చేసి, నిత్యం ముఖానికి పట్టిస్తే నలుపు తగ్గి, ముఖచర్మం ప్రకాశవంతమవుతుంది. వెన్నలో గులాబీ రెక్కల పేస్టును కలిపి పెదాలకు రాస్తే పెదాలు గులాబీ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
-వెన్నలో పసుపు కలిపి మడమలకు, పాదాల పగుళ్లకు రాస్తే దురదమంట తగ్గి, చర్మం మెత్తపడి పగుళ్లు తగ్గిపోతాయి. వెన్న, కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి కళ్లకింద ఏర్పడిన నల్లని చారలకు, ముడతలకు రాస్తుంటే మచ్చలు తొలిగిపోతాయి.

187
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles