శక్తి అందాలంటే...


Wed,June 8, 2016 01:29 AM

మన శరీరం రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత శక్తి కావాలి. ఆ శక్తిని అందించేది ఆహారం. మనం తీసుకున్న ఆహారం నాలుగు గంటల్లోగా జీర్ణం అయిపోతుంది. కాబట్టి మనం ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి అంటారు. ఆరుగంటల సమయం గడిచిపోయినా మనం ఎటువంటి ఆహారమూ తీసుకోకపోతే శరీరానికి అవసరమైన శక్తి అందదు. సాధారణంగా మనం రాత్రిపూట ఆరుగంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతాం. ఆ తరువాత మనం లేచి రెడీ అయ్యేసరికి మరో గంట, రెండు గంటల సమయం పడుతుంది. అప్పుడు కూడా ఏమీ తినకుండా మధ్యాహ్న భోజనం వరకు వేచివుండడమంటే పొట్టలో మంట పెట్టడమే అవుతుంది. దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం. దీన్నే బ్రేక్‌ఫాస్ట్ అంటాం. అంటే ఉపవాసాన్ని విడవడం. రాత్రి సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోం కాబట్టి అది ఒకరకంగా అది ఉపవాసం లాంటిదే కదా. అందుకే అల్పాహారం బ్రేక్‌ఫాస్ట్ అయింది. సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో లోపించిన కీలకమైన పోషకపదార్థాలను ఈ అల్పాహారమే భర్తీ చేయాల్సి ఉంటుంది.

1811
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles