వ్యర్థాల నుంచి నిర్మాణ సామగ్రి


Sat,January 12, 2019 01:27 AM

CEMENT
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆవాసాల సంఖ్య ఏటా పెరుగుతున్నాయి. అయితే ఇదే క్రమంలో నిర్మాణానికి అవసరమైన సహజవనరులు నానాటికి తరిగిపోతున్నాయి. దీంతో ఇసుక, సున్నపురాయి, కాంక్రీటు తదితర నిర్మాణ సామాగ్రి భవిష్యత్తు తరాలకు దొరకని దుస్థితి నెలకొనే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రిపై చాలా కాలం నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జలంధర్‌లో నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భోపాల్ సీసీఎంబీ విభాగం ఆవిష్కరించిన ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రి ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

వ్యర్థాల నుంచి ఉత్పత్తులు..

పరిశ్రమ వ్యర్థాల సాయంతో ఇసుక, కాంక్రీటు, సిమెంట్ వంటి సరికొత్త నిర్మాణ సామగ్రిని తయారు చేయవచ్చని నిరూపితమైంది. దేశ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు నానాటికి పెరిగిపోతున్నాయి. అయితే వాటి నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు మానవాళికి సమస్యగా మారుతున్నది. ఈ తరహా వ్యర్ధాల సమస్యకు పరిష్కారం చూపెడుతూనే.. మరోవైపు వ్యర్థాలకు అర్థం తెచ్చేలా నూతన ఆవిష్కరణలు జరిపారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలే ఆధారంగా పునరుత్పత్తులను తయారు చేసేందుకు పరిశోధనలు ప్రారంభించి విజయం సాధించారు. ైఫ్లె యాష్, రెడ్ మడ్ నుంచి ఇసుక, సిమెంట్ ఫ్రీ కాంక్రీట్, హైబ్రిడ్ కాంపోసిట్స్ తయారు చేస్తున్నారు.

అల్యూమినియం ఉత్పత్తి ప్రక్రియలో రెడ్ మడ్ అనేది వ్యర్థ ఉత్పత్తి. మన దేశంలో దాదాపు 50లక్షల టన్నుల రెడ్ మడ్ వ్యర్థ ఉత్పత్తిగా విడుదలవుతుంది. దీన్ని భూమిపై పారేస్తుండటం వల్ల భూకాలుష్యం పెరుగుతున్నది. ప్రస్తుతం సీసీఎంబీ రెడ్ మడ్ నుంచి ఇసుకను తయారు చేయడం ప్రారంభించింది. ఇక మరొక పరిశ్రమ వ్యర్థమైన ఫ్లైయాష్ నుంచి ఇప్పటికే పలు చోట్ల ఇటుకల తయారు జరుగుతున్నది. దీంతో సిమెంట్ ఫ్రీ కాంక్రీట్‌ను తయారు చేస్తున్నారు. వ్యర్థ పదార్థాల నుంచి హైబ్రిడ్ కాంపోసిట్లను తయారు చేసే విధానాన్ని ఆవిష్కరించారు. సముద్ర ఇసుక నుంచి కాపర్ టైళ్లను తయారు చేస్తున్నారు.

భవిష్యత్తు అవసరాల కోసం..

తరిగిపోతున్న ఇసుక నిల్వలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు భోపాల్‌లోని ఏఎంపీఆర్‌ఐలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న జగిత్యాల జిల్లా మోతె వాసి శ్రీరాం సత్తయ్య తెలిపారు. అందరికి అందుబాటు ధరలో ఉండేలా వీటిని ఆవిష్కరిస్తున్నామని, భవిష్యత్తు తరాల అవసరాలను ప్రత్యామ్నా నిర్మాణ సామగ్రి తీర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

640
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles