వైరల్ అప్పగింతలు!


Tue,February 5, 2019 10:25 PM

ఈ తరం అమ్మాయిలు, బంధాల విలువలతో పెద్దగా పట్టింపు ఉండదు. అన్నింటినీ లైట్‌గా తీసుకుంటారు అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ అది తప్పు అని నిరూపిస్తున్నది ఓ వీడియో. ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
Bengali-Bride
పెండ్లి పిల్లను పంపే తంతు పాత రోజుల్లో ఎలా ఉండేది? చూస్తే ఏడుపు రానివాళ్లకు కూడా ఏడుపొచ్చే విధంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో అప్పగింతల కార్యక్రమం సరదాగా సాగిపోతున్నది. భావేద్వేగాలకు అవకాశం లేకుండా పోతున్నది. కానీ ఇప్పటికీ ఎక్కడో అక్కడ భావోద్వేగాల అప్పగింతల కార్యక్రమం చూస్తూనే ఉన్నాం. అలాంటి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. బెంగాళీ సాంప్రదాయ కుటుంబానికి చెందిన పెండ్లిపిల్ల అప్పగింతలప్పుడు భావోద్వేగానికి గురైన తీరు అందర్నీ ఆలోచింపజేస్తున్నది. 68 వేల మంది షేర్ చేశారంటే ఈ వీడియో ను జనాలు ఎంతలా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ ఆమె ఇచ్చిన సందేశం ఏంటంటే.. తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. ఈ రోజు నుంచి నేను మెట్టినింట్లో అడుగు పెడుతున్నా అని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ భయమంతా నేను నా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్నా? అనే విషయంలో. ఇప్పటివరకు నాకు ఏ సమస్య రాకుండా చూసుకున్నారు. తల్లిదండ్రుల దగ్గర గడిపిన ఆనంద క్షణాలకు ఇక గుడ్‌బై అని నా కన్నీళ్లు చెప్తున్నాయి అని చెప్పింది.

435
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles