వైమానిక దళంలో మహిళా లెఫ్టినెంట్ రికార్డ్


Sun,February 17, 2019 01:39 AM

భారత అత్యున్నత సైనిక, వైమానిక రంగాల్లో మహిళలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తాజాగా చంఢీగడ్‌కు చెందిన హీన జైస్వాల్ వైమానిక రంగంలో రికార్డు నెలకొల్పారు..
women-engineer
ైఫ్లెట్ లెఫ్టినెంట్ హీన జైస్వాల్ భారత వైమానిక దళంలో తమదైన ఖ్యాతిగాంచారు. మొదటిసారి మహిళా పైలెట్ ఇంజినీర్‌గా నియమితులయ్యారు. గతేడాది వరకూ భారత వైమానిక దళానికి చెందిన పురుషుల క్లబ్ మాత్రమే ఉండేది. 2015 జనవరిలో భారత వాయు దళానికి చెందిన ఇంజినీరింగ్ విబాగంలో ఉన్నత స్థాయి కోర్సులో ఎంపికైన మొదటి మహిళగా హీన రికార్డు సాధించారు. యెల్హెంకాలోని ఎయిర్ ఫోర్స్‌ల స్టేషన్‌లో 112 హెలికాప్టర్ యూనిట్‌లో ఆరు నెలల కోర్సును పూర్తి చేసుకుంది. కాగా ైఫ్లెట్ లెఫ్టినెంట్ జైస్వాల్ ఐఎఎఫ్ విభాగంలో సేవలను అందిస్తారు. సియాచెన్ గ్లాసియర్స్, అండమాన్ సముద్రాల వరకూ అన్ని రకాల పరిస్థితుల్లో ఒత్తిడితో కూడా విధులను నిర్వహించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. విమాన సంక్లిష్ట వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించడం, నిర్వహించడం ైఫ్లెట్ ఇంజనిర్ ప్రధాన విధి అని చెప్పారు.

541
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles