వైబ్రెంట్ బొల్లారం సిటీ


Sat,March 9, 2019 12:15 AM

-డబుల్ బెడ్‌రూం.. రూ.34 - 36 లక్షలు
-11 ఎకరాలు.. 1,040 ఫ్లాట్లు

VBCITY
ఇన్‌కార్ సంస్థ బొల్లారం ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ చేరువలో వీబీ సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. కొంపల్లి- బొల్లారం మార్గంలో.. దాదాపు పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నది. రెరా అనుమతి పొందిన ఈ నిర్మాణంలో వచ్చేవన్నీ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లే. ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం.. దాదాపు 842 చదరపు అడుగులు కాగా మొత్తం 18 టవర్లను నిర్మిస్తారు. ఇలా, ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. దాదాపు 1,040. ప్రతి బ్లాకు స్టిల్ట్ ప్లస్ ఐదు అంతస్తుల ఎత్తులో నిర్మిస్తారు. ఇందులో నిర్మించేవి డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు అయినప్పటికీ, ఆధునిక సదుపాయాల విషయంలో రాజీపడటం లేదు.అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని.. వారికి అవసరమయ్యే సౌకర్యాలకు ప్రాజెక్టులో స్థానం కల్పిస్తారు. క్లబ్‌హౌజ్‌కు పెద్దపీట వేశారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, మల్టీపర్పస్ హాల్ వంటివి ఏర్పాటు చేస్తారు. హాఫ్ బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులు.. క్రికెట్ నెట్ వంటివి పొందుపరుస్తారు. చిన్నారుల ఆటస్థలాలకు పెద్ద పీట వేస్తారు. ఇందులో ప్రత్యేకంగా ఒక స్కూల్ ఏర్పాటు చేస్తామని సంస్థ చెబుతున్నది.

-ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. కొంపల్లి హైవే దాటాక వచ్చే బొల్లారం ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ చేరువలో నిర్మిస్తున్నారు. ఇక్కడ్నుంచి ఔటర్ రింగ్ రోడ్డు సైతం చేరువలోనే ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, షాపింగ్ కేంద్రాలన్నీ సమీపంలోనే ఉంటాయి. ఇందులో నివసించేవారు అలా నిమిషాల్లో మార్కెట్‌కు వెళ్లి ఇలా తమక్కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ల ధర.. ఫేసింగును బట్టి రూ.34 నుంచి 36 లక్షలు చెబుతున్నారు.

292
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles