వైఫైతో చార్జింగ్!


Wed,March 6, 2019 01:21 AM

ఏంటీ? వైఫైతో చార్జింగా.. అదెలా సాధ్యం? అని ఆశ్చర్యపోకండి. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అప్‌డేట్ వల్ల ఏదైనా సాధ్యమే!
wifi
ఔను మీరు చదివింది నిజమే! మీ ఫోన్‌కు వైఫై కనెక్ట్ అయి ఉంటే చాలు.. మీకు చార్జర్‌తో పనే లేదు. అవును.. ఎంఐటీ పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణ చేశారు. వైఫై ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ద్వారా బ్యాటరీల అవసరం లేకుండానే రిమోట్ సెన్సార్లు, ఇంటర్నెట్‌తో అనుసంధానం అయి ఉండే గాడ్జెట్లను ఆపరేట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా వైఫై సిగ్నల్స్‌ను ఎలక్ట్రిసిటీగా మార్చి మొబైల్‌ను చార్జింగ్ పెట్టవచ్చు. సెమీ కండక్లర్స్ ద్వారా రూపొందించిన రేడియో యాంటెన్నా వైఫై సిగ్నల్స్‌ను గ్రహించి వైర్‌లెస్ ఎనర్జీగా మార్చేస్తుంది. రెక్టెన్నా అని పేరుపెట్టిన ఈ యాంటెన్నా త్వరలో ప్రయోగం పూర్తి చేసుకొని మార్కెట్లోకి రానుంది. ఎంఐటీ రీసెర్చర్లు తయారుచేసిన ఈ రెక్టెన్నాలు ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌ల రేడియో యాంటెనాకు కనెక్ట్ చేస్తారు. ఏసీ సిగ్నల్స్ సెమీ కండక్టర్ల ద్వారా ప్రవహించడం వల్ల అది డీసీ గా మారుతుంది. దీన్నీ విద్యుత్ సర్క్యూట్, బ్యాటరీ రీచార్జికి వాడొచ్చు. ఇది గనుక పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తే.. భవిష్యత్తులో వైఫైతో పనిచేసే వైర్‌లెస్ కరెంట్ అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

403
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles