వైకల్యం ఓడిపోయింది!


Sat,April 13, 2019 10:35 PM

జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు.. విజయం వరించి తీరుతుంది. ఆ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమీ చేయలేవు. అలాంటిదే మయన్మార్‌కి చెందిన ఈ బాలుడి కథ.
kaung

మయన్మార్‌కి చెందిన 16 యేండ్ల కౌంగ్ ఖాంట్ లిన్ ఫుట్‌బాల్ ఆటగాడు. అతను బరిలోకి దిగితే ఆ టీమ్ గెలవాల్సిందే. లిన్‌కి ఇష్టమైన మాంచెస్టర్ యునైటెడ్ టోర్నమెంట్‌లో బెస్ట్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. లిన్‌కి మెస్సీ ప్లేయర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతనిది కూడా ఎడమ చేతివాటం కావడమే. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో లోకల్ ఫేమ్ అయ్యాడు. ఖాంట్ లిన్ రెండు గోల్స్ సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. ఇతని విజయం, అవార్డుని చూసి అదృష్టవంతుడు అనుకుంటారు.

కానీ తన పుట్టుకే దురదృష్టంతో మొదలైంది అంటున్నాడు లిన్. అతనికి కుడికాలు లేదు. చిన్నతనం నుంచి ఒక చేతితో క్రచ్ పట్టుకొని నడుస్తుంటాడు. నడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఒక్కరోజైనా ఫుట్‌బాల్ కోచ్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఐదేండ్ల వయసులో లిన్ సులువుగా నడువడానికి చెక్కతో చేసిన క్రచ్‌ని లిన్ చేతికిచ్చాడు అతని మామ. చిన్నగా నడువడం మొదలుపెట్టి ప్లాస్టిక్ బాల్‌తో ఫుట్‌బాల్ ఆడేవాడు. ఒక్కసారి గ్రౌండ్‌లోకి దిగితే లిన్‌కి ఒక కాలు లేదన్న విషయాన్నే మరిచిపోయి మామూలుగా ఆడి టీమ్‌ని గెలిపించాడు. భవిష్యత్తులో ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాడు లిన్.

176
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles