వేసవి చిట్కాలు..


Fri,April 12, 2019 12:53 AM

సెలవులొచ్చాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్ని ఎండలుంటే ఏంటి సమ్మర్ టూర్లు వేయకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు కదా!పర్లేదు. వేసవిలో ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
summer-travel
-ప్రయాణమే కదా ఎంజాయ్ చేస్తే పర్లేదు. ఎండలే కదా అని నిర్లక్ష్యం చేయకండి. జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వడదెబ్బ తగిలి మంచానికెక్కాల్సి వస్తుంది.
-వేసవిలో దాహం ఎక్కువే అవుతుంది.కాకున్నా సరే నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది. ఇది చాలా ముఖ్యం. నీళ్లు ప్రయాణపు అలసట నుంచి దూరం చేయడమే కాకుండా శరీరాన్ని వాతావరణపు మార్పులు తట్టుకునేలా చేయగలవు.
-ప్రయాణమంటేనే చిరుతిండ్లు అంటారు చాలామంది. అది సహజం కూడా. కానీ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. అసలే ఎండాకాలం ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లను, కాయలను తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోస వంటివాటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతలాభం.
-ఎండలకు చర్మం మండిపోతుంది. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రయాణాలేంటో కానీ చర్మం పాడైపోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎండలో వెళ్లే ముందు చర్మానికి సన్‌స్క్రీన్, లోషన్ వంటివి రుద్దుకోవడం మరిచిపోవద్దు. అవి మీ చర్మాన్ని కాపాడుతాయి.
-సెలవులు ఉన్నప్పుడు బాగా నిద్రపోవాలనుకుంటాం. కానీ తిరిగి అలిసిపోతాం. కొత్త ప్రదేశాల్లో నిద్రకూడా పట్టదు. కానీ నిద్ర అవసరం. చాలాముఖ్యం కూడా. బాగా నిద్రపోయి శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వండి. సుదూర ప్రయాణాలను సురక్షితంగా చేసి ఈ సమ్మర్‌ని ఎంజాయ్ చేయండి.

347
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles