వేసవిలో ఏమేం తినాలి?


Mon,March 11, 2019 12:43 AM

కాలానికి తగ్గట్లుగా ఆహారం, అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఎండలు మండుతున్నాయి. ఏ కాలంలో ఎలాంటి దుస్తులు వాడాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
Ragi-Ambli
-వేసవిలో జంక్‌ఫుడ్ మానేస్తే మంచిది. దీనివల్ల అజీర్తి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. పొడి పొడి ఆహార పదార్థాలు తీసుకునే కంటే సాంబార్, రసం, పెరుగు తదితరాలు తీసుకుంటే మంచిది.
-సమ్మర్‌లో ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా సంకటి, అంబలి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు. జొన్నలు, రాగులతో చేసిన అంబలి, సంకటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చు.
-రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు, మినరల్స్, అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎండలో తిరిగే వారి ఆరోగ్యానికి ఎండ తీవ్రతను తట్టుకునే శక్తినిస్తుంది. వేసవిలో రోజూ ఒక కప్పు రాగిజావ తీసుకుంటే అధిక దాహార్తి నుంచి తప్పించుకోవచ్చు.
-తీవ్రమైన ఎండ నుంచి ఉపశమనం పొందాలన్నా, శరీరాన్ని చల్లగా ఉంచాలన్నా సజ్జలు, జొన్నలు, రాగులతో చేసిన వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
-వీటితో పాటు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు, ద్రవ పదార్థాలు, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ ముక్కలు, తాజా పండ్లు, రసాలు తీసుకుంటే డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు.

958
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles