వేధించే నొప్పులకు హోమియో


Wed,February 24, 2016 01:59 AM

సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి? హోమియోపతిలో చికిత్స ఉందా?


మెడలోని సి1 నుంచి సి7 వరకు ఉన్న వెన్నుపూసలు అనుసంధానమై ఉన్న భాగాన్ని సర్వైకల్ భాగమంటారు. ఇక్కడి కీళ్లలోని మధ్యభాగం తగ్గిపోవడం, డిస్క్‌లో వాపు, వెన్నుపూస మధ్యలో రాపిడి ఎక్కువ కావడం, ఆస్టియోఫైట్స్ చేరడం వల్ల మెడ భాగం నుంచి చేతి వేళ్ల వరకు నొప్పితో పాటు తిమ్మిర్లు, చేయి మొద్దుబారడం, మెడ పట్టేయడం, తల తిరగడం, ఒక్కోసారి వాంతి వచ్చినట్టుండడం లాంటి సమస్యలుంటాయి. నగరజీవితం గడిపేవారిలో ప్రతి పదిమందిలో అయిదుగురికి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటుంది. యాసిడ్ ఫాస్ అనే మందు ఎటువంటి సర్వైకల్ స్పాండిలోసిస్‌కైనా బాగా పనిచేస్తుంది. మెడ భాగం నుంచి భుజం, చేయి, చేతివేళ్ల వరకు నొప్పికి కాల్మియా లాటిఫోలియా మందు మంచిది. వీళ్లకి తిమ్మిర్లు కూడా ఉంటాయి.

న్నునొప్పి దీర్ఘకాలికంగా బాధిస్తూ ఉంటే సర్జరీ అవసరమని చెప్తుంటారు. మరి హోమియో మందుల ద్వారా దీన్ని నయం చేయవచ్చా?


జీవితాంతం వేధించే ఈ నొప్పులతో నిరాశ చెందేవారికి హోమియోపతి అద్భుతమైన చికిత్స. ఈ వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్డ్, డిస్క్ కంప్రెషన్, నరాల మీద ఒత్తిడి గురిచేసి తీవ్రమైన నొప్పి వస్తూంటుంది. ఇలాంటప్పుడు హోమియోపతి మందులు వ్యాధి మూలకారణమైన డిస్క్ బల్జ్, నరాల ఒత్తిడిలను తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. కోబాల్ట్ మందు దీర్ఘకాలికంగా కదలకుండా కూర్చునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, క్లర్కుల లాంటి ఉద్యోగులకు, ఊబకాయంతో నడుంనొప్పితో బాధపడేవారికి అవసరం. దెబ్బలు తగలడం, డిస్క్ బల్జ్, ప్రమాదంలో వెన్నెముకకు దెబ్బతగలడం లాంటి సమస్యలు ఆపరేషన్‌కు దారితీస్తాయి. ఇలాంటప్పుడు సింఫైటమ్, ఆర్నిక, హైపరికం, బెల్లిస్, పెర్నిస్, అగారికస్ మందులు పనిచేస్తాయి.

నొప్పులకు జీవితాంతం నివారణ మాత్రలు వాడాల్సిందేనా?


మెడ, నడుము నొప్పి సమస్యలు తమ ఉద్యోగ విధులకు ఆటంకం కలిగిస్తుంటాయి. వెన్నునొప్పితో పనిచేసే ఉద్యోగులు 40 శాతం వరకు విరామం తీసుకుంటారు. ఒక సర్వే ప్రకారం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా ఈ కండరాలు బిగుసుకొనిపోయి, ఇంకా నొప్పి తీవ్రత పెరిగే ఆస్కారం ఉంది. బెడ్‌రెస్ట్ తీసుకునే ముందు డాక్టర్ సలహా పాటించాలి. నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడడం వల్ల కడుపులో మంట, ఆకలి మందగించడం, వికారంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్టులుంటాయి. హోమియోమందులు ఈ దుష్ప్రభావాలు లేకుండా మూలకారణాన్ని తొలగిస్తాయి. ప్రతిరోజూ నడుము, మెడ సంబంధమైన వ్యాయామాలు డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. చాలాసేపు నిల్చోవడం, కూర్చోవడం మానడం, శరీర ఎత్తుకు తగిన బరువును మెయిన్‌టెయిన్ చేయడం, చాలా జాగ్రత్తగా అత్యవసరమైతేనే బరువులు ఎత్తడం, దించడం, సరైన భంగిమలో కూర్చోవడం ద్వారా వెన్నునొప్పి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

హోమియోపతిలో మెడ, నడుము, వెన్నెముక సమస్యలకు వాడే మందులను వివరించండి.
-ఆస్కులస్ హిప్ : కూర్చుని ఉండి, నిల్చునేటప్పుడు, వంగి లేచేటప్పుడు తీవ్రంగా నొప్పి వస్తుంది. మిగతా సమయంలో నొప్పి తక్కువగా ఉంటుంది. ఈ మందు రక్తనాళాలు ఉబ్బడం, సిరల సమస్యలు, పైల్స్ ఉన్నవారిలో బాగా పనిచేస్తుంది.
-రస్టాక్స్ : వెన్నునొప్పికి మొదటగా ఆలోచించే మందు ఇది. హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యుల్ హానిమన్ దీన్ని కనుగొన్నాడు. నడుములో దీర్ఘకాలికంగా ఉండే నొప్పులకు, విశ్రాంతి తీసుకునే సమయంలో ఎక్కువగా ఉండే నొప్పి.
-బ్రయోనియా ఆర్బ్ : కదలికలో నడుంనొప్పి ఎక్కువగా ఉండి, విశ్రాంతిలో ఉపశమనం కలుగుతుంది. రస్టాక్స్‌కు వ్యతిరేక లక్షణాలుంటాయి. వాతావరణ మార్పుల వల్ల సైనోవియం, కండరాలు, కీళ్ల మీద ఉండే పొర అరుగుదల వల్ల వెన్నునొప్పి వస్తుంది. -కల్కేరియా ఫ్లోర్ : నడుంనొప్పి తీవ్రమైన మంటతో కూడుకుని ఉంటుంది. దీనిలో రోగికి చలనం, నడవడం విశ్రాంతినిస్తుంది. రస్టాక్ట్ లాంటి లక్షణాలను పోలివుండి డిస్క్ కంప్రెషన్, వెన్నుపూసకు దెబ్బ తగలడం, డిస్క్ బల్జ్, విటమిన్ డి3, కాల్షియం లోపాలతో వచ్చే దీర్ఘకాలిక నడుము నొప్పికి బాగా పనిచేస్తుంది. రస్టాక్స్ పనిచేయనివారికి ఈ మందు వల్ల ఉపశమనం కలుగుతుంది.

4433
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles