వేడి కురుపులు తగ్గాలంటే?


Wed,September 5, 2018 12:48 AM

శరీరంలో వేడి ఎక్కువయినప్పుడు వేడికురుపులు వస్తుంటాయి. అవి కొన్నిసార్లు నొప్పిని కలిగిస్తుంటాయి. ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తోనే వేడికురుపులను పోగొట్టడం ఎలాగో తెలుసుకుందాం.
తమలపాకులను నీటిలో బాగా మరిగించాలి. తమలపాకులు చల్లారాక పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని వేడికురుపుల మీద రాయాలి. ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే వేడికురుపులు తగ్గిపోతాయి.

heat-boiles
-జీలకర్రపొడిలో కొంచెం నీటిని పోసి పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని వేడికురుపుల మీద రాయాలి. ప్రతీ నాలుగంటలకి ఒకసారి రాస్తూ ఉంటే వేడికురుపుల బాధ తప్పుతుంది.
-వెల్లుల్లి పేస్టును తయారుచేయాలి. దీనిని వేడికురుపుల మీద ఐప్లె చేయాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే వేడికురుపుల నుంచి మంచి ఫలితాలను పొందగలరు.
-ఆముదం నూనెలో దూదిని ముంచి వేడికురుపుల మీద సున్నితంగా రాయాలి. 20 నిమిషాల తరువాత సాధారణ నీటితో శుభ్రపరుచుకోవాలి. రెండు వారాల పాటు ఈ పద్ధతిని పాటిస్తే వేడికురుపులు తగ్గవచ్చు.
-గుప్పెడు వేపాకులను పది నిమిషాల పాటు నీటిలో మరిగించాలి. చల్లారిన సొల్యూషన్‌ను స్ప్రే బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీనిని ముఖం కడిగేందుకు కూడా వాడుకోవచ్చు. అలాగే వేడికురుపుల మీద స్ప్రే చేస్తూ ఉంటే కురుపులు తగ్గిపోయి మళ్లీ రాకుండా ఉంటాయి.

2375
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles