వేగన్ డైట్‌తో కాలుష్యానికి చెక్


Sat,March 16, 2019 02:00 AM

పండగొచ్చినా, పబ్బమొచ్చినా పాలు, మాంసం వంటి కొన్నిరకాల వస్తువులు తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అయితే..కొన్ని వస్తువుల వాడకం వల్ల మనకు తెలియకుండానే పర్యావరణానికి చేటు చేస్తున్నాం. కొన్ని రకాల ఉత్పత్తులనుఆపేస్తే.. వాతావరణ మార్పులను, పర్యావరణ కాలుష్యాన్నినిరోధించవచ్చంటున్నారు నిపుణులు. అదెలా అంటే..
vegan-diet
నిత్యం మనం చేసే పనుల వల్ల పర్యావరణం ఓ రేంజ్‌లో కలుషితమవుతుంది. దీంతో అనారోగ్యం, వర్షాలు పడకపోవడం, వేడి పెరగడం ఇలా ఎన్నో సమస్యలు మొదలవుతున్నాయి. వీటికి చరమగీతం పలుకాలంటే ఏం చేయాలో చెప్తున్నారు పర్యవరణ నిపుణులు. వాహనాలు, మాంసం, పాల ఉత్పత్తులు కాలుష్యానికి ప్రధాన కారణలని ఓ అధ్యయనంలో తేలింది. వేగన్ డైట్ ఫాలో అయితే.. పర్యావరణాన్ని చాలావరకు కాపాడుకున్న వాళ్లమవుతాం అంటున్నారు అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ జోసెఫ్. మాంసం, పాల ఉత్పత్తులు మన ఆహారంలో ఎక్కువ స్థాయిలో ఉండడం కూడా కాలుష్యానికి ఒక రకమైన కారణమట. పాలు, మాసం రెగ్యులర్‌గా తీసుకోవడమంటే.. ఆహారం ఉత్పత్తి చేయడానికి అవసరమైన 80 శాతం వనరులను అదనంగా వాడడమేనట.

మెరుగైన వ్యవసాయ పద్ధతులు, ఆహారపు అలవాట్ల వల్ల గడ్డిభూములు కాపాడబడుతాయి. దీంతో పచ్చదనం కొంతవరకు కాపాడబడుతుంది. జంతువులకు అవసరమైన గడ్డి వల్ల, వాటి పేడ వల్ల భూమిలో సారం పెరుగుతుంది. ఫలితంగా మంచి పంటలు, మంచి వాతావరణం నెలకొంటుంది. మాంసానికి ఎక్కువగా అలవాటు పడితే క్రమంగా జంతువులు నశిస్తాయి. పాల ఉత్పత్తి కూడా జంతువుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు ప్రొఫెసర్ జోసెఫ్. అందుకే.. పర్యావరణానికి ఏమాత్రం కీడు చేయని వేగన్ డైట్.. అంటే.. ఎక్కువగా కూరగాయలతో కూడిన భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యమే కాదు.. ప్రకృతి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తేల్చారు.

684
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles