వెన్నుశక్తి పునరుత్తేజితం


Tue,February 12, 2019 01:17 AM

Vaidya-Shastram
మానవ ఆధునిక వైద్య చరిత్రలోనే సరికొత్త అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రమాదవశాత్తు పక్షవాతానికి గురైన ఒక వ్యక్తి వెన్నుశక్తిని వైద్య పరిశోధకులు ఆశ్చర్యకరంగా పునరుద్ధరించారు.


పోయిన ప్రాణం ఎటూ మళ్లీ రాదు. కానీ, ప్రమాదవశాత్తు పక్షవాతానికి గురైన వ్యక్తి వెన్నుపూసల్లోని నాడీశక్తిని పునరుత్తేజితం చేయడం సాధ్యమేనని అమెరికాలోని వైద్య పరిశోధకులు ఇటీవల నిరూపించారు. నమ్మశక్యం కాని విధంగా అలాంటి బాధితుడు ఒకరు స్వీయచలన శక్తిని పొందగలిగారు. స్పైనల్ ఇంప్లాంట్ (దేహం లోపల అమర్చే వెన్నెముక పరికరం)తోపాటు భౌతిక చికిత్సను మేళవించి వారు దీనిని సాధ్యపరిచారు. జెరెడ్ చిన్నాక్ (29) అనే యువకుడు 2013లో ఒక మంచు రహదారిలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై పక్షవాతం బారిన పడ్డాడు. అతని ఛాతీ సంబంధ వెన్నుపూసల వద్ద తీవ్ర గాయమైంది. దీంతో మొండెం కిందివైపు ప్రదేశం చైతన్యరహితం (పక్షవాతం)గా మారింది. మిన్నెసొటా (Minnesota) రాష్ర్టానికి చెందిన రోచెస్టర్ (Rochester) నగరంలోని మాయో క్లినిక్ నిపుణులు నిజంగానే ఏం మాయ చేశారో కానీ అతణ్ని తిరిగి నిలబెట్టి, నడిపించగలుగుతున్నారు.


2016లో అతనికి శస్త్రచికిత్స జరగ్గా, ఒక ఎలక్ట్రోడ్‌తో కూడిన స్పైనల్ ఇంప్లాంట్‌ను వెన్నెముక బాహ్యభాగంలో గాయపడ్డ స్థలానికి కిందివైపు అమర్చారు. కడుపులో చర్మం కింద పల్స్ జనరేటర్ అమర్చి దానితో అనుసంధానించారు. బయటి నుంచే నియంత్రిస్తూ నాడీ ఉత్తేజానికి నిపుణులు జరిపిన భౌతిక చికిత్స 22 వారాల తర్వాత మంచి ఫలితాన్నిచ్చింది. ముందు చక్రంతో కూడిన వాకర్ సాయంతో అతనిని వారు నిలబెట్టి, నడిపించగలిగారు. ఐతే, ఇది అతనిలో ఎలా, ఎందుకు సాధ్యమైందన్నది మాత్రం వారికి అంతుబట్టడం లేదు. అది తెలుసుకోవడంలోనే ఇప్పుడు వారు నిమగ్నమైనారు.

534
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles