వెండితెర హీరో.. ష్ల్బై!


Sun,March 3, 2019 01:34 AM

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే అంత ఈజీ కాదు. పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. అదృష్టం కూడా కలిసిరావాలి. వాటికి మించి పట్టుదల, కృషి, తపన ఉండాలి. అయితే.. అనూహ్యంగా ఓ శునకం స్టార్ హీరో అయింది. వెండితెరను దున్నేస్తున్నది.
Dog-Hero
సినీ ఇండస్ట్రీలో ఎంత పేరు, పలుకుబడి ఉన్నా.. సరైన స్క్రిప్టు, ప్రతిభ లేకపోతే నిలదొక్కుకోవడం చాలా కష్టం. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అంతా ఇదే పరిస్థితి. కానీ లాస్ ఏంజెల్స్‌లో చెత్తకుప్పల్లో తిరిగే ఓ శునకం.. అనూహ్యంగా వెండితెర స్టార్‌గా మారిపోయింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అదే. పేరు ష్ల్బై. ఇది చెత్తకుప్పల్లో తిరుగుతుంటే.. ఎనిమల్ కంట్రోల్ అధికారి మేఘన్ చేరదీసింది. తర్వాత ఎనిమల్ షెల్టర్‌కు తీసుకెళ్లి.. ష్ల్బై అనే పేరు పెట్టింది. కొద్దికాలానికి కుక్కలకు సంబంధించి మంచి సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నారు హాలీవుడ్ రచయితలు కేథరిన్, బ్రూస్ కెమెరాన్. తమ స్క్రిప్ట్‌కు సరిపడే కుక్కకోసం చాలాచోట్ల తిరిగారు. వేలల్లో కుక్కలను స్క్రూటిరీ చేశారు. అదే సమయంలో ష్ల్బై వారి కంటపడడం.. దానికి శిక్షణ ఇవ్వడం.. ఏ డాగ్స్ వే హోమ్‌లో హీరో క్యారెక్టర్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ సినిమాలో ష్ల్బై పాత్ర పేరు బెల్లా. గత నెలలోనే రిలీజైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. బెల్లా పాత్రలో ష్ల్బై నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలా ఒక్క సినిమాతోనే ఈ శునకం స్టార్‌గా మారిపోయింది.

550
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles