వీధి కుక్కలపై ఎనలేని ప్రేమ!


Wed,February 27, 2019 11:45 PM

ఓ రోడ్డు ప్రమాదంలో ఒక కుక్కపిల్ల గాయపడింది. దాన్ని గమనించిన ఓ 14 యేండ్ల అమ్మాయి ఇంటికి తీసుకొచ్చింది. దానికి చికిత్స చేసి ప్రాణం నిలిపింది. ఈ ఒక్క కుక్క పిల్ల పరిస్థితే ఇలా ఉంటే ఇంకా ఎన్ని కుక్కలు ఇలా రోడ్ల మీద గాయాలపాలవుతున్నాయో అనుకుంది. అప్పుడే ఓ ఆలోచన చేసింది.
chandani-Grover
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన చందానీ గ్రోవర్ షంకార్ వ్యాలీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నది. యేడాది క్రితం ఇంటికి దగ్గర్లో ఒక కుక్కపిల్ల కారు కింద పడి గాయాలపాలైంది. కొనప్రాణాలతో కొట్టుకుంటున్న ఆ పప్పీని ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేసింది. ప్రమాదం నేను చేశాను కాబట్టి ఆ కుక్కను రక్షించి చికిత్స అందించగలిగాను. ఇలా ఇంకెన్ని ప్రమాదానికి గురవుతున్నాయో అన్న సందేహం కలిచివేసింది. వీధి కుక్కలకి రక్షణ కల్పించాలని అనుకున్నాను అని తెలిపింది. యేడాది క్రితం భోపాల్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు ఆశ్రమాలను నిర్మించాలని తీర్మానించారు. కానీ, ఆ పని మధ్యలోనే ఆగిపోయింది. దాన్నే కుక్కలకి ఆసరాగా చేయాలనుకున్నది. దీనికిగాను చిత్రాన్షు సెన్, నశ్రత్ అహ్మద్, డాక్టర్ అనిల్ శర్మ, కుటుంబ సభ్యులు సాయం చేశారు.

అందరూ కలిసి బార్ఖెడాలో ఆర్‌ఎఆర్‌సిని స్థాపించారు. షెల్టర్‌లో ఉన్న కుక్కలన్నింటినీ చెకప్ చేయమని డాక్టర్ శర్మను కోరింది. మూగజీవుల మీద చూపుతున్న ప్రేమకు చూసి, వారానికి ఒకసారి కుక్కలకు ఉచితంగా ట్రీట్‌మెంట్ హెల్త్ చెకప్‌లు చేస్తున్నారు. విదేశాల నుంచి తెప్పించుకొని మరీ కుక్కలను పెంచుకుంటున్నారు. ఇక్కడ ఉండే వాటి గురించి అసలు పటించుకోరు. కుక్కలు ప్రాడక్ట్స్ కాదు. వాటికీ మనలాగే మనసుంటుంది. మూడు నెలల్లో 15,000 చదరపు అడుగులతో 48 కుక్కలకు షెల్టర్ ఏర్పాటు చేసింది. చిత్రాన్షు తన ఉద్యోగాన్ని వదులుకొని దీన్నే ప్యాషన్‌గా ఎంచుకున్నాడు. డాక్టర్ శర్మ కుక్కలకు శిక్షణ ఇస్తున్నాడు. చందానీకి ఆస్తమా సమస్య ఉన్నా తనని తల్లిదండ్రులు ప్రోత్సహించేవారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, డాగ్ లవర్స్ డబ్బుని విరాళంగా ఇస్తున్నారు. చదువుతో పాటు వీటి పెంపకాన్ని సమానంగా చూసుకుంటానంటున్నది. వీధి కుక్కల మీద చూపుతున్న వివక్షపై సమాజంలో మార్పు తీసుకువస్తానని ఆమె చెబుతున్నది.

295
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles