వీధిపోటు తప్పాలంటే?


Sat,March 2, 2019 12:19 AM

శాంతినివాసం.. ఇదే ఫెంగ్‌షుయ్ లక్ష్యం. మనిషికి మేలు చేసే శక్తి నిరాటంకంగా ఇంట్లోకి ప్రవేశించి నలుమూలలా విస్తరించేలా చేయడమే ఫెంగ్‌షుయ్ సూత్రాల సారాంశం. ఎలాంటి ఆటంకం లేకుండా ఇంట్లోకి ప్రవేశించి.. ప్రతికూల శక్తి (నెగెటివ్ ఎనర్జీ)ని తరిమేస్తే ఇంట్లోని వారిపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. సానుకూల శక్తి ప్రవేశానికి ఆటంకం కలిగితే ఆ ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం దూరం అవుతుంది. శారీరక మానసిక ఆరోగ్యం లోపించిన ఇంట్లో సంపద నిలవదని ప్రత్యేకంగా చెప్పాలా?
VEEDHI-POTU
ఇల్లుండే ప్రదేశం.. నిర్మించిన తీరుపై కూడా పాజిటివ్ ఎనర్జీ రాకపోకలు ఆధారపడి ఉంటాయి. పర్వతాలు, పచ్చని చెట్లు, సెలయేళ్లు ఉన్న ప్రదేశాలు నివాసానికి అన్నివిధాల మంచివని ప్రాచీన ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఇంటి నిర్మాణం కూడా గ్రీన్ డ్రాగన్- వైట్ టైగర్ తీరులో ఉండాలని సూచిస్తుంది. ఇదేంటో అనుకోవద్దు. ముందు తక్కువ ఎత్తు.. వెనుకకు వెళ్లే కొద్దీ ఎక్కువ ఎత్తు గాను.. కుడివైపుతో పోలిస్తే ఎడమ వైపు ఎత్తుగా ఉండేలా నిర్మించాలన్నదే దీని సారాంశం. ప్రకృతి శక్తుల దాడి నుంచి తట్టుకునే గృహం పటిష్ఠంగా నిలబడేలా చూడటమే ఇలాంటి డిజైన్ వెనుక రహస్యం.

నేటి ఆధునిక యుగంలో ఇవన్నీ పాటించడం సాధ్యం కాదు. మన ఇల్లు వరకూ మనం కావాల్సినట్లు కట్టుకోగలం. పక్కిల్లు, ప్లాటు రూపురేఖలు, ఎత్తు పల్లాలను మనం ఎంతమాత్రం నియంత్రించలేం కదా. ఇంటిపై అందులోని వారిపై ఎంతో ప్రభావం చూపే మరో ముఖ్యాంశం రోడ్డు. రహదారి అన్నది సానుకూల, ప్రతికూల శక్తులకు వాహకంలా ఉపయోగపడుతుందని.. ఇంట్లోనూ పరిసరాల్లోనూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని ఫెంగ్‌షుయ్ విశ్వసిస్తుంది. నిత్యం ట్రాఫిక్ద్ద్రీతో ఉండే రహదారులకు పక్కగా నివసించడం మంచిది కాదు. సరిగ్గా ఇంటి సింహద్వారానికి ఎదురుగా రోడ్డు ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ విషయంలో ఫెంగ్‌షుయ్, వాస్తులది ఒక్కటే బాణి. వాస్తు చెప్పే వీధి శూల, రోడ్డు పోటు అంటే ఇదే. రహదారుల నుంచి నిరాటంకంగా వేగంగా వచ్చే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోని వారిపై దుష్ప్రభావం చూపిస్తుంది.


వీధిశూల.. వీధి పోటుకు మరేంటి విరుగుడు? వీధిపోటుకు ఫెంగ్‌షుయ్ ఏం చెబుతోంది? ఇంటికి రోడ్డుకు మధ్యలో (ఎంట్రెన్స్ ఎదురుగా కాదు) పచ్చటి చెట్లు పెంచడమే దీనికి విరుగుడు. వాహనాల వెంబడి దూసుకొచ్చే ప్రతికూల శక్తిని చెట్లు అడ్డుకుంటాయి. ఇది సాధ్యం కాకపోతే, మెయిన్ ఎంట్రెన్స్ రోడ్డుకు ఎదురుగా రాకుండా మార్చుకోవడం మరో మార్గం. ఇందుకు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. అందరికీ సాధ్యం కాకపోవచ్చు కూడా. పోర్చ్ నిర్మించడం మరో మార్గం. ఇవేమీ కుదరకపోతే.. తుది ప్రత్యామ్నాయం ప్రతిబింబించే అద్దాలు (రిఫ్లెక్టింగ్ మిర్రర్) అమర్చుకోవడమే. తలుపుకి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే ఫ్రెంచి విండోస్‌కీ వీటిని బిగించుకోవచ్చు.

537
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles