విహారంలో వికారమా?


Fri,February 1, 2019 12:16 AM

vomot
ప్రయాణం చేస్తే చాలు..కొంతమంది తలనొప్పి, నీరసం, శరీరమంతా నొప్పిగా ఉంటుంది. బస్సుల్లో, రైళ్లలో అయితే చెప్పనక్కర్లేదు. వరుసపెట్టి వాంతులు చేస్తుంటారు. అలా వాంతులు రాకుండా ఉండాలంటే


ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

- మద్యం సేవించడం, పొగ తాగడం చేయరాదు. ఇలా చేస్తే సమస్యను మనమే కొని తెచ్చుకున్నట్టు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినరాదు.
- ప్రయాణం చేసేటప్పుడు చివరి సీట్లో కూర్చోకండి. చాలామంది కిటీకి పక్క సీటును ఇష్టపడి మరీ కూర్చుంటారు. అది కూడా ఒక కారణమే.
- ముఖ్యంగా ప్రయాణంలో పుస్తకాలు చదువకూడదు. అలా చదువడం వల్ల కంటిచూపు తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాంటి భావన కలిగి వాంతులు రావొచ్చు.
- వాహనాల నుంచి వచ్చే ఉద్ఘారాలు, డీజిల్, పెట్రోల్, ఇతర వ్యక్తుల చెమట వాసన వల్ల కూడా ఒక్కోసారి వాంతులు అవుతాయి. సువాసన వెదజల్లే పువ్వుల వాసన పీల్చుకుంటే ఫలితం ఉంటుంది.
- అన్నింటికంటే ఎక్కువ ఉపయోగపడేది నిమ్మకాయ. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను వెంటపెట్టుకుంటే చాలు. వాంతి వచ్చేటట్టు ఉంటే దాని వాసన పీల్చుకుంటే సరిపోతుంది. నిమ్మరసం తాగినా ఫర్వాలేదు.
- ముందస్తుగానే వాంతి వస్తుందన్న భావన ఉన్నవారు ప్రయాణానికిముందు అల్లం రసాన్ని తీసుకోవాలి. లేకపోతే మధ్యదారిలో అల్లం టీ గానీ, సిట్రస్ ఉన్న పండ్లు, రసాలు తీసుకుంటే వాంతులు రాకుండా ఆపవచ్చు.

601
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles