విహంగ వీక్షణం.. విభిన్న ఛాయాచిత్రం


Fri,April 19, 2019 01:42 AM

అందరి చూపు ఒకలా ఉంటే..ప్రపంచమంతా ఒకేలా ఉంటుంది. ఒకేలా కనిపిస్తుంది. కొత్తగా ఉంటే కదా కిక్కుండేది. అందుకే ఈ పైలట్.. ఇలాంటి హైలెట్ పనులు చేయడం ప్రారంభించాడు.
alex-maclean1
అలెక్స్ మ్యాక్ లీన్ వృత్తిరీత్యా పైలట్. ఫొటోగ్రఫీ ప్రవృత్తి. అమెరికా దేశాన్ని మొత్తం విహంగవీక్షణంతో ఫొటో డాక్యుమెంటరీ చేయాలనుకున్నాడు. కేవలం ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీని ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని పనిని ప్రారంభించాడు. నదులు, సముద్రాలు, పొలాలు, తోటలు, కట్టడాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి అందాలను తన కెమెరా కంటితో బంధించాడు. ఇప్పటికే తను తీసిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమయ్యాయి. 2009లో క్రూనీ ఇంటర్నేషనల్ బుక్ అవార్డు కూడా అందుకున్నాడు. లాస్ వెగాస్, న్యూయార్క్ వంటి నగరాలను ఇప్పటివరకూ ఎవరూ ఊహించని, చూడని విధంగా ఫొటోలు తీసి ఆశ్చర్యపరిచాడు.
alex-maclean

168
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles