విస్తారమైన ఆలోచన


Fri,March 8, 2019 01:57 AM

ఇయ్యాల అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా ప్రయాణికుల కోసం విశాల హృదయంతో కూడిన ఆలోచన చేసింది విస్తార ఎయిర్‌లైన్స్ ఘసంస్థ.
vistara
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విస్తార ఎయిర్ లైన్స్ సంస్థ మహిళా ప్రయాణికులకు ఉచితంగా సానిటరి ప్యాడ్స్‌ను ఇవ్వనున్నది. ప్యాడ్స్ ఆన్ బోర్డ్ పేరుతో క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టింది. ప్రయాణించే మహిళల అభ్యర్ధన మేరకు వాటిని అందజేస్తారు. దేశీయ ఎయిర్‌లైన్స్ అయిన విస్తార డొమెస్టిక్ ఫ్లయిట్లను నడుపుతున్నది. విమానంలో ఉండే ఎయిర్‌హోస్టెస్‌లు ఈ అంశానికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కూడా కల్పించనున్నారు. రాయిపూర్ నుంచి దిబ్రూఘర్ విమానంలో ఈ సర్వీస్‌ను మొదటిసారి ప్రారంభిస్తున్నారు. వీరు ఇచ్చే ప్యాడ్స్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. అవి పూర్తిస్థాయి ఆర్గానిక్, బయోడీగ్రేడబుల్‌తో తయారు చేయిస్తున్నారు. కాగా, ప్రయాణికులకు సానిటరి న్యాప్‌కిన్స్ ఉచితంగా అందజేస్తున్న మన దేశంలోని మొదటి ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా ఇదే.

495
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles