విశ్వాసం.. అభిమానం


Fri,April 19, 2019 01:54 AM

ఎంతో ఇష్టంగా ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. ఒక్కోసారి అవి యజమాని మాట వినకపోతే శిక్షణనిచ్చే నిపుణుల దగ్గరికి తీసుకెళ్తారు. ఆ నిపుణుల్లో ఒకరు ఆసియాలో గుర్తింపు పొందిన షిరిన్. ఇటు కుక్కలకు శిక్షణనిస్తూ, మానవత్వం చాటుకుంటున్నారు.
shirin
1995లో ముంబైకి చెందిన సనమ్ కరుణాకర్ కుటుంబం వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. సనమ్ నడుము వంగింది. మొత్తం వీల్‌చెయిర్‌కే పరిమితం అయింది. ఈ వార్తను తెలుసుకున్న షిరిన్ ఆమెను కలుసుకుంది. వీల్ చైర్‌లో ఉంటూనే తను ఏం చేయగలదో తనతో చేయించాలనుకుంది. అప్పటికే కుక్కలకు శిక్షణను ఇవ్వడంలో అనుభవం కలిగిన షిరిన్, సనమ్‌ను కుక్కలకు ట్రైనర్‌గా చేయాలని కోరింది. దీనికి సంతోషంగా అంగీకరించింది సనమ్. ఈ శిక్షణలో కుక్కలకు ప్రత్యేక పద్ధతులను అలవాటు చేస్తారు. వాటి మనస్తత్వం అధ్యాయనం చేసి వాటికి సరైన శిక్షణ ఇస్తారు. వీల్‌చెయిర్‌లో ఉండే యజమానులు ఎవరైనా ఉంటే వారికి కుక్కలు సాయపడేలా శిక్షణనిస్తారు. తలుపులు తీయడం, చిన్న చిన్న వస్తువులు తీసుకురావడం, చైర్‌ను లాగడం వంటి పనుల్లో తర్ఫీదు ఇస్తారు. షిరిన్‌ది జంతుప్రేమికుల కుటుంబం కావడంతో ఆమె చిన్నప్పటి నుంచే జంతువులను ప్రేమించసాగింది. 1998లో కేనైన్స కెన్ కేర్ అనే ఆర్గనైజేషన్‌ను స్థాపించింది. దాని ద్వారా నిపుణులను తయారు చేయడం, కుక్కలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం షిరిన్ తొమ్మిది మంది గుర్తింపు పొందిన కేనైన్స్ ట్రెయినర్లను తయారు చేసింది.

171
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles