విమానాలే కానుకలు!


Wed,April 17, 2019 11:55 PM

భగవంతుడు భక్తులు కోరిన కోరికలు తీర్చాడని, కష్టాల నుంచి గట్టెక్కించాడని కృతజ్ఞతతో కానుకలు అర్పిస్తుండటం ఆనవాయితీ. కానీ ఆ ఆలయం తీరే వేరు. అక్కడ ఇవేవీ కాదు, విమానం బొమ్మలు కానుకగా ఇవ్వాలి. వింతగా ఉన్నా ఇది నిజం.
Shaheed-Baba
పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌కి కొన్ని కిలోమీటర్ల దూరంలో తల్హాన్‌ గ్రామం ఉంది. అక్కడ నిహాల్‌ సింగ్‌ గురుద్వారా టెంపుల్‌ ఉన్నది. నిహాల్‌ సింగ్‌ మంచి మనసున్నవాడు. ఆయన ప్రతి ఒక్కరికీ తనకు తోచిన సాయం చేసేవాడు. నిహాల్‌ సింగ్‌ బావుల్లో నీళ్లు తోడుకోవడానికి గిలకలు అమర్చే పని చేసేవాడు. ఆయన చేయి పడగానే బావిలోని నీరు తీయగా మారిపోయేదట. కానీ ఒకరోజు తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రమాదానికి గురై చనిపోయాడు నిహాల్‌ సింగ్‌. అయితే ఆయన మంచితనం మాత్రం అందరి మనసుల్లోనూ నిలిచిపోయింది. అందుకే ఆయన అనుచరుడు హర్నమ్‌ ఆయన సమాధిని నిర్మించాడు. అప్పటి నుంచి ప్రజలందరూ ఆయన వర్ధంతిని జరపడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అదో పండుగలా మారిపోయింది. అయితే ఒకసారి ఒక భక్తుడు విదేశాలకు వెళ్లేలా ఆశీర్వదించమని నిహాల్‌ సింగ్‌ సమాధి వద్ద ప్రార్థించాడు. అతనికి నిజంగానే అవకాశం దొరికింది. ఆ విషయాన్ని అతడు ఎంతో సంతోషంగా అందరికీ చెప్పాడు. అప్పటి నుంచి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉన్నవాళ్లంతా అక్కడికి వచ్చి, ఒక విమానం బొమ్మని సమర్పించి మొక్కుకోవడం మొదలుపెట్టారు. రానురాను అది ఒక ఆచారంగా మారిపోయింది.

377
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles