విమానంలో వై-ఫై?


Fri,March 8, 2019 01:56 AM

అవును. మీరు చదివింది నిజమే! విమానంలో వై-ఫై వాడుకొనే సరికొత్త టెక్నాలజీని భారత విమానయాన రంగం పరిచయం చేస్తున్నది. అదేంటి? దాని ప్రత్యేకతలేంటి?
wifi
విమానం ఎక్కగానే ఎయిర్‌హోస్టెస్ వచ్చి మీ మొబైల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేయండి. లేదా ైఫ్లెట్ మోడ్‌లో పెట్టండి అని చెప్తారు. ఫ్లయిట్ మూవ్ అయ్యాక ఆఫ్ లైన్ వీడియోలు, డౌన్‌లోడెడ్ పాటలు వినడం తప్ప ఇంటర్నెట్ వాడే వెసులుబాటు అస్సలు లేదు. ఇది ఇప్పటి వరకు అంతర్జాతీయ విమానాల్లోనే ఉండేది. ఇప్పుడు మనం కూడా విమానాల్లో వైఫై వాడుకోవచ్చు. హ్యూగ్స్ కమ్యూనికేషన్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ దీనికి సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నది. విమానయాన రంగంలో తొలిసారి వైఫై అందిస్తున్న సంస్థ కూడా ఇదే. శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఎయిర్‌లైన్‌లోని రూటర్ ద్వారా మొబైల్‌కు చేరుతుంది. ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. వైఫై ఆప్షన్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుడి నుంచే సర్వీస్ చార్జీల రూపంలో వసూలు చేస్తారు. సో.. ఫైనల్లీ మన దేశంలోని విమానాల్లో కూడా వైఫై సౌకర్యం రాబోతున్నది. ఇకనుంచి ప్రయాణం మరింత సులభం, ఆనందమయం కాబోతున్నదన్నమాట.

397
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles