విద్యా రుణాల వారధి విద్యాలక్ష్మీ.కో.ఇన్


Sat,March 2, 2019 12:07 AM

vidya-lakshmi
కాలేజీ ఫీజులు భారం అయిన నేపథ్యంలో ఎడ్యుకేషన్ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదా? అయితే మీకోసమే కేంద్రం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. అందులో రిజిస్ట్రర్ చేసుకుంటే చాలు 36 బ్యాంకుల్లో ఏదో ఒకటి మీకు రుణాన్ని ఇచ్చే అవకాశాన్ని పొందవచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహిస్తున్న ఈ పోర్టల్ పేరు www.vidyalakshmi.co.in ఇందులో ఒకసారి రిజిస్ట్రర్ చేసుకుంటే చాలు. విద్యారుణానికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు, దాన్ని ట్రాక్ కూడా చేయవచ్చు. అలాగే ఈ సైట్ లో రిజిస్ట్రర్ చేసుకుంటే నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌కు లింకేజిని కూడా కల్పిస్తుంది. దీన్ని నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ(ఎన్‌ఎస్‌డీఎల్) ఈ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు నిర్వహిస్తున్నాయి. దాదాపు 36 ప్రభుత్వ, ప్రవేట్ బ్యాంకులు ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానం అయి ఉన్నాయి. ఈ వెబ్‌సైట్ విద్యా రుణం కోసం రిజిస్ట్రర్ ఎలా చేసుకోవాలో చూద్దాం.

1 రిజిస్ట్రర్ చేసుకుని అకౌంట్ ప్రారంభించండి

www.vidyalakshmi.co.in అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రర్ అనే బటన్ నొక్కి మీ వివరాలను పొందుపరిచి రిజిష్ర్టేషన్‌ను పూర్తి చేయండి. ఆ తర్వాత సబ్‌మిట్ కొడితే మీకు యాక్టివేషన్ లింక్ మీ ఈ మెయిల్‌కు వస్తుంది. ఈ మెయిల్ వచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ విద్యాలక్ష్మి సైట్‌లో మీ అకౌంట్ ప్రారంభించినట్టు అవుతుంది. ఈమెయిల్‌కు వచ్చిన యాక్టివేషన్ లింక్‌ను 24 గంటల్లోనే ఓపెన్ చేయాలి.

2 స్కీమ్‌ను ఎంచుకోండి ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తును నింపే ముందు ఆ సైట్‌లో ఆఫర్ చేస్తున్న దాదాపు వివిధ బ్యాంకులు అందిస్తున్న 96 స్కీముల్లో ఒక దాన్ని ఎంచుకోండి. గరిష్ఠంగా మూడు బ్యాంకుల స్కీములకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా ఎంచుకున్న తర్వాత మీరు కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ (సీఈఎల్‌ఏఎఫ్)ను నింపాల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తును నింపే ముందు మీ ఆదాయ దృవపత్రాలు, గుర్తింపు కార్డులు, విద్యార్హతల వంటి వివరాలను లేదా సర్టిఫికేట్లను దగ్గర ఉంచుకోండి.

3 రుణానికి దరఖాస్తు

ఆతర్వాత లింక్‌లో మీకు 7 ట్యాబ్‌ల్లో సవివరంగా మార్గదర్శకాలు ఉంటాయి. ఎంత రుణం కావాలి? ఆదాయం, కాంటాక్ట్ వివరాల వంటి అంశాలను నింపాలి. అలాగే అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్లను తప్పనిసరిగా చదవండి. తప్పనిసరిగా నింపాల్సిన వివరాలను మాత్రం కచ్చితంగా నింపాల్సిందే. ప్రతి వివరాన్ని నింపిన తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కి ఆ తర్వాత సేవ్ చేసి నెక్ట్స్ బటన్‌ను నొక్కాలి. ఈ వివరాలే ప్రతి బ్యాంక్ పరిశీలిస్తుంది కనుక తప్పులు లేకుండా సరిచూసుకోండి.

4ఫాలోఅప్

విద్యాలక్ష్మి హోమ్ పేజీలోనే అప్లికేషన్ స్టేటస్ బటన్ నొక్కితే ఎడ్యుకేషన్ లోన్ కోసం మీరు చేసుకున్న దరఖాస్తు ఏ స్టేజీలో ఉందో తెలిసిపోతుంది. మీరు ఎంచుకున్న బ్యాంకు బ్రాంచిలో కూడా మీ దరఖాస్తు స్టేటస్ గురించి వాకబు చేయవచ్చు. సాధారణంగా బ్యాంకులే మీమ్ముల్ని సంప్రదిస్తాయి. ఒకవేళ అలా జరుగని పక్షంలో సంప్రదించడం తప్పనిసరి. ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతై విద్యాలక్ష్మి బ్రాంచీలను సంప్రదించవచ్చు. వెబ్‌సైట్‌లోనే కాంటాక్ట్ అనే లింక్‌లోకి వెళితే బ్రాంచీల వివరాలు తెలుస్తాయి.

334
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles